Ilayaraja : ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇళయరాజా సంగీతం అందించిన మూవీ ఏంటో తెలుసా?

Ilayaraja : తమిళ తంబీలు ఇసైజ్ఞాని గా పిలుచుకునే కోలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ తాజాగా రెమ్యూనరేషన్ విషయంలో మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ఓ సినిమాకు పారితోషికం తీసుకుండా మ్యూజిక్ అందించారన్న వార్త బయటకు వచ్చింది. మరి ఇళయరాజా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సంగీతం అందించిన మూవీ ఏంటో తెలుసుకుందాం.

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఇళయరాజా. ఇళయరాజా తన మధురమైన సంగీతంతో తమిళంతో పాటు సౌత్ సినీ అభిమానులను కట్టిపడేసారు. 1980లలో మొదలైన ఆయన సంగీత ప్రస్థానం నేటికీ కొనసాగుతోంది. ఆయన సంగీతంలో చివరగా విడుదలైన ‘విచితు’ పాటలకు భారీ స్పందన లభించింది. ప్రస్తుతం ఇళయరాజా వింతిథి సినిమా రెండో భాగానికి సంగీతం అందిస్తున్నారు. అంతే కాకుండా మరికొన్ని సినిమాలకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

ఇళయరాజా పారితోషికం తీసుకోకుండా చేసిన సినిమా ఇదే

కోలీవుడ్ డైరెక్టర్ పి వాసు తాజాగా మాట్లాడుతూ ఇళయరాజా గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టారు. పి వాసు దర్శకుడిగా అరంగేట్రం చేసిన మొదటి చిత్రం పన్నీర్ పుష్పాంగల్. ఇళయరాజా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు. అప్పట్లో ఆయన కమిట్ అయిన ఒక్కో సినిమాకు రూ.లక్ష పారితోషికం తీసుకుంటున్నారు. అయితే పి వాసు విషయంలో మాత్రం ఇళయరాజా తన మంచి మనసును చాటుకున్నారు. మూవీ పూర్తయ్యే వరకు పారితోషికం గురించి మాట్లాడని ఇళయరాజాను ఒకానొక సందర్భంలో డైరెక్ట్ గా డైరెక్టర్ పి.వాసు అడిగారు. వెంటనే ఇళయరాజా తన రెమ్యూనరేషన్ గురించి ఆయన అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘మొదటి సినిమా ఎప్పుడూ ప్రత్యేకమే. బాగా చేయండి. నాకు రెమ్యూనరేషన్ వద్దు’ అని చెప్పారట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు పి వాసు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

- Advertisement -

మ్యూజిక్ డైరెక్టర్ లేకుండానే ఇళయరాజా బయోపిక్

తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాటలను అందించిన ఇళయరాజా జీవిత చరిత్ర ప్రస్తుతం సినిమాగా రూపొందుతోంది. ఈ మూవీలో ఇళయరాజాగా ధనుష్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత దర్శకుడు లేకుండానే సినిమా సిద్ధమైంది. ఎందుకంటే ఇందులో ఇళయరాజా ఎవర్‌గ్రీన్ పాటలు, నేపథ్య సంగీతాన్ని ఉపయోగించనున్నట్లు సమాచారం.

కాంట్రవర్సీలు కూడా ఎక్కువే

ఎవర్ గ్రీన్ మ్యూజిక్ అందించి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు కారణమైన ఇళయరాజా చుట్టూ ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి కాపీరైట్ సమస్య. డీల్ పూర్తయ్యాక కూడా కొన్ని మ్యూజిక్ సంస్థలు తన మ్యూజిక్ వాడుకుంటున్నాయని, తాను రూపొందిన పాటపై పూర్తి హక్కులు మ్యూజిక్ కంపోజర్‌కే ఉన్నాయని ఇళయరాజా కోర్టును ఆశ్రయించారు. అలాంటప్పుడు పాటల రచయిత కూడా హక్కు క్లెయిమ్ చేస్తే ఏమవుతుందని ఇళయరాజాను కోర్టు ప్రశ్నించింది. దీంతో ఇదో పెద్ద వివాదంగా మారింది. కాపీరైట్ విషయంలో గీత రచయిత పాత్ర కూడా ఉందని వైరముత్తు వ్యాఖ్యానించగా, నిర్మాతకే పూర్తి హక్కు ఉందని నిర్మాత కె రాజన్ కామెంట్స్ చేశారు. ఈ వివాదంపై కోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందో  చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు