Ileana : ఇల్లీ బేబీ ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేకింగ్ న్యూస్… సినిమాలకు గుడ్ బై

గోవా బ్యూటీ ఇలియానా సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందా? అంటే తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల కాలంలో రిలేషన్షిప్, పెళ్లి, ప్రెగ్నెంట్ అంటూ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది ఇల్లీ బేబీ. ‘పోకిరి’ సినిమాతో టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అక్కడ పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఇటీవల కాలంలో ఆఫర్లు లేకపోవడంతో అప్పుడప్పుడు మాత్రమే సినిమాల్లో మెరిసింది.

తెలుగులో చివరిసారిగా ఆమె రవితేజతో చేసిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ మూవీ డిజాస్టర్ గా నిలిచి ఆమె ఆశలను గల్లంతు చేసింది. దీంతో మొత్తానికి ఈ బ్యూటీకి ఆఫర్లు కరువయ్యాయి. ప్రస్తుతం తన కొడుకుతో టైం స్పెండ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది ఇలియానా. అయితే రీ ఎంట్రీకి సిద్ధమవుతుందని, అందుకోసం టాలీవుడ్ లోని పాత పరిచయాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుందంటూ రీసెంట్ గా రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అంతలోనే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అనే వార్త ఇలియానా అభిమానుల్ని కలవరపెడుతోంది. లవ్ ఎఫైర్ బ్రేకప్ లాంటి వ్యవహారాలతో ఎంతగానో కృంగిపోయిన ఇలియానా సినిమాలకు దూరంగా ఉండాలని సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం.

గతంలో ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ తో ఇలియానా కొంతకాలం రిలేషన్షిప్ మైంటైన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలానికే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అనంతరం ఇలియానా పెళ్లి, పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడం వంటి విషయాలు వరుసగా బయటకు రావడం ఆమె అభిమానులను షాక్ కు గురిచేసాయి. నిజానికి ఇలియానా పెళ్లి ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఇప్పటిదాకా బయటపడలేదు. కానీ ఒక్కసారిగా తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. అది చాలదన్నట్టు ప్రెగ్నెంట్ కావడానికి కొన్ని నెలల ముందే ఇలియానా పెళ్లి కూడా చేసేసుకుందట. రీసెంట్ గా ఇలియానా తన భర్త మిచెల్ డోలెన్ ని సోషల్ మీడియా ద్వారా అందరికీ పరిచయం చేసింది.

- Advertisement -

ఇక సినిమాలకు దూరంగా ఉండటంతో పాటు ఇలియానా మాలో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఆమె సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తన భర్త, కొడుకుతో కలిసి ఇలియానా దేశం విడిచి వెళ్ళిపోతుందట. ఆమె యుఎస్ లో సెటిల్ కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇలియానాకు సినిమాలపై ఎలాంటి ఆసక్తి లేదని, అందుకే విదేశాలకు వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తోందని అంటున్నారు. ఏదేమైనా ఇలియానా ఇకపై సినిమాల్లో కనిపించదు అనే విషయం మాత్రం ఆమె అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అవుతుందని చెప్పాలి.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు