IMDb Top 100 Most Viewed Indian Stars : ఈ దశాబ్దంలో పాపులర్ స్టార్స్ IMDb లిస్ట్ అవుట్… టాప్ లో ప్రభాస్ హీరోయిన్

IMDb Top 100 Most Viewed Indian Stars : IMDb 2014 నుంచి 2024 వరకు అంటే గత పదేళ్ళలో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారల జాబితాను విడుదల చేసింది. తాజాగా రిలీజ్ చేసిన ఈ లిస్ట్ లో ప్రభాస్ హీరోయిన్ ఫస్ట్ ప్లేస్ లో ఉండడం విశేషం. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఇంకా ఈ లిస్ట్ లో స్థానం దక్కించుకున్న హీరోయిన్లు, హీరోలు ఎవరు ? అనే వివరాల్లోకి వెళ్తే..

దీపికానే నెంబర్ వన్

IMDb టాప్ 100 లిస్ట్ లో దీపికా పదుకొణే మొదటి స్థానంలో ఉంది. దీపికకు ఈ ఏడాది అన్నీ గుడ్ న్యూస్ లే అందుతుండడం విశేషం. దీపికా నటించిన చాలా సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. అలాగే ఆమె కూడా తల్లి కాబోతోంది. త్వరలో దీపికా-రణ్‌వీర్ సింగ్ ఇంటికి ఓ చిన్న అతిథి రాబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ లిస్ట్ లో నెంబర్ 1 ప్లేస్ ను దక్కించుకుంది అంటే ఈ పదేళ్ళలో ఆమెనే బిగ్గెస్ట్ ఇండియన్ సూపర్ స్టార్ అని మూవీ లవర్స్ తీర్పు ఇచ్చేశారన్న మాట. ఇక ఈ జాబితాలో ముగ్గురు ఖాన్‌ల పేర్లు కూడా ఉన్నాయి. ఈ విషయంపై స్పందిస్తూ దీపికా సంతోషాన్ని వ్యక్తం చేసింది. త్వరలోనే ఈ బ్యూటీ ప్రభాస్ కల్కి మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది.

Image

- Advertisement -

అసలేంటి ఈ IMDb టాప్ 100 లిస్ట్ ?

ప్రపంచవ్యాప్తంగా పేజీ వీక్షణల ఆధారంగా స్టార్ ర్యాంకింగ్‌లను IMDb నిర్ణయిస్తుంది. ఇక గత దశాబ్ద కాలంలో పాపులర్ అయిన టాప్ 100 సెలబ్రిటీల లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే ఇందులో బాలీవుడ్, సౌత్ స్టార్స్‌తో సహా మొత్తం 100 మంది అంతర్జాతీయ స్టార్‌ల పేర్లు ఉన్నాయి.

IMDb జాబితాలో గత దశాబ్దంలో అత్యధికంగా వీక్షించబడిన టాప్ 100 భారతీయ తారల పేర్లు జనవరి 2014 నుండి ఏప్రిల్ 2024 వరకు IMDb వీక్లీ ర్యాంకింగ్‌లపై ఆధారపడి ఉన్నాయి. ఈ ర్యాంకింగ్‌లు ప్రపంచవ్యాప్తంగా IMDbకి 250 మిలియన్ల కంటే ఎక్కువ నెలవారీ వీక్షకుల వాస్తవ పేజీ వీక్షణల ఆధారంగా నిర్ణయించారు.

టాప్ 10 IMDb లిస్ట్

గత 10 ఏళ్లలో అత్యంత ప్రజాదరణ పొందిన తారల్లో చోటు దక్కించుకున్న స్టార్స్ ఎవరంటే.. దీపికా పదుకొణె పేరు ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉంది. బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ రెండో స్థానంలో, ఐశ్వర్య రాయ్ బచ్చన్ మూడవ స్థానంలో, క్యూట్ అలియా భట్ నాల్గవ స్థానంలో, దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఐదవ స్థానంలో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఆరో స్థానంలో, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఏడో స్థానంలో, బాలీవుడ్ దబాంగ్ సల్మాన్ ఖాన్ ఎనిమిదో స్థానంలో, హృతిక్ రోషన్ తొమ్మిదో స్థానంలో, బాలీవుడ్ ప్లేయర్ అక్షయ్ కుమార్ పదో స్థానంలో ఉన్నారు.

టాప్ 100లో ఉన్న ఇతర స్టార్స్

ఈ జాబితాలో హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, అమితాబ్ బచ్చన్, సమంతా రూత్ ప్రభు, కరీనా కపూర్, నయనతార, తమన్నా, అజయ్ దేవగన్, త్రిప్తి డిమ్రీ తదితరులు ఉన్నారు. టాప్ 100 స్టార్స్ లిస్ట్ లో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఉన్నారు. 1960లో బాలనటుడిగా అరంగేట్రం చేయడంతో కమల్ హాసన్ 54వ స్థానంలో ఉన్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు