ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హిందీ సినీ పరిశ్రమలో తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. శ్రీదేవి, బోనీకపూర్ దంపతుల గారాల పట్టి జాన్వీ కపూర్ రొటిన్ హీరోయిన్ పాత్రలకు భిన్నంగానే వెళ్తుందనే చెప్పాలి. ఆమె ఎంచుకునే సినిమాలు చాలా భిన్నంగా ఉండడం విశేషం. ప్రస్తుతం ఆమె నటించిన చిత్రం ‘మిలి’.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి జాన్వికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. మైనస్ 16 డిగ్రీల గడ్డ కట్టుకుపోయే చలిలో ఇరుక్కుపోయిన జాన్వీ నోటిని ఉపయోగించి టేపులను చింపేసే సన్నివేశంతో ఈ టీజర్ ప్రారంభం అయింది. ఆమె టీజర్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నించడం, ఆమెను బంధించినట్టు కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకుల ముందుకు రాబోతుంది.
అంతకు ముందు జాన్వి మొదటి పోస్టర్లో జాన్వి పాత్రను అభిమానులకు పరిచయం చేసింది. ఈ సినిమాలో జాన్వీ 24ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్ అయిన మిలి నౌడియాల్ పాత్రలో కనిపించనుంది. ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘ఒక గంటలో ఆమె జీవితం మారబోతుంది మిలి’ అని రాసుకొచ్చింది. ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర ఆకట్టుకునేలా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరికొందరూ జాన్హవి తొలిసారి మేకప్ లేకుండా నటిస్తుందా అంటే కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి జాన్వీ నటించిన మిలి మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకుంటుందనే చెప్పవచ్చు.