Vishwak Sen : ప‌వ‌న్ త‌ర‌హాలో

యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ కీలక పాత్రలో వస్తున్న తాజా ఓరి దేవుడా. ఈ చిత్రాన్ని యూనిట్ ప్రకటించిన నాటి నుంచి ప్రేక్షకుల దృష్టిని ఆక‌ర్షించింది. అశ్వ‌త్ మారి ముత్తు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రసాద్ వి. పొట్లూరి నిర్మిస్తున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ దేవుడు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ నటిస్తున్నాడు.. అది కూడా దేవుడి పాత్రలో అని తెలిసిన నాటి నుండి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

భారీ స్థాయిలో తెరకెక్కిన ఓరి దేవుడా మూవీ షూటింగ్ ఇటీవలే పూర్త‌యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులను శ‌ర‌వేగంగా జరుపుకుంటుంది. ఒక వైపు పోస్ట్ ప్రొడక్షణ్ పనులు జరుపుకుంటూనే.. మరో వైపు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ చిత్ర యూనిట్ విడుదల చేస్తోంది. గోపాల గోపాల సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ దేవుడి పాత్ర‌లో న‌టించిన‌ట్టుగానే ఈ సినిమాలో విక్ట‌రీ వెంక‌టేష్ దేవుడి పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. ఈ నేప‌థ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ‘ఔననవా..’ అంటూ సాగే మెలోడి సాంగ్ విడుదల చేసింది.

ఈ సాంగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అవుననవా.. అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ అద్భుతంగా ఉంది. ’ఏమ‌ని అనాల‌ని తోచ‌ని క్ష‌ణాలివి..ఏ మ‌లుపో ఎదుర‌య్యే ప‌య‌న‌మిదా..‘ అనే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు ఈ సినిమాలో ఒక లాంగ్ జర్నీ సందర్భంలో వచ్చే పాట అని తెలుస్తోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ లిరిక్స్ చాలా బాగున్నాయి. ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట విపరీతంగా ఆకట్టుకుంటుంది. లియోన్ జేమ్స్ సంగీతం కూడా బాగుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు