Inaya Sultana : బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ… అతని ప్రొఫెషన్ ఏంటో తెలుసా?

Inaya Sultana : Indian 2 Controversy : బిగ్ బాస్ రియాలిటీ షోలో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయిన వాళ్ల దగ్గర నుంచి సినిమాలు, సీరియల్స్ ద్వారా అప్పటికే తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు కూడా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అప్పటికే ఎంత కొంత గుర్తింపు ఉన్న ఈ కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన తర్వాత బుల్లితెర ప్రేక్షకులకు మరింతగా దగ్గరవుతున్నారు. అలా టెలివిజన్ ప్రేక్షకులకు చేరువైన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఇనాయ సుల్తానా ఒకరు. తాజాగా ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. మరి ఇంతకీ అతను ఏం చేస్తాడో తెలుసా?

ఇనాయా బాయ్ ఫ్రెండ్ ఎవరంటే?

తాజాగా ఇనాయ తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేసింది. దానికి జస్ట్ లవ్ సింబల్ ని మాత్రమే క్యాప్షన్ ఇచ్చి, తాను షేర్ చేసిన పోస్ట్ లో ఉన్న వ్యక్తి తన బాయ్ ఫ్రెండ్ అని హింట్ ఇచ్చింది. సడన్ గా తను ప్రేమలో ఉన్నాననే విషయాన్ని బయట పెట్టడమే కాకుండా ఏకంగా ప్రియుడిని పరిచయం చేయడంతో ఆమె వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఇనాయ ప్రియుడు పేరు గౌతమ్ కొప్పిశెట్టి. అతను ఒక యోగా ట్రైనర్, జిమ్ కోచ్ అని సమాచారం. వీళ్ళిద్దరి పరిచయం కూడా జిమ్ లోనే ఏర్పడగా, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఉంటుందని ఊహగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆ వీడియోలో ఇనాయ తన బాయ్ ఫ్రెండ్ తో రొమాంటిక్ గా కనిపించింది.

Inaya Sultana: ప్రియుడిని పరిచయం చేసిన బిగ్‍బాస్ బ్యూటీ.. వీడియో వైరల్..

- Advertisement -

సీజన్ 6 లో కంటెస్టెంట్ గా…

కాగా ఇనాయ సుల్తానా బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. ఆట తీరుతోనే కాదు తన అందంతో కూడా తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ కంటెస్టెంట్ గా మారింది. ఇక షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్యూటీ సినిమాలతో బిజీ అవుతుందేమో అనుకుంటే పెద్దగా అవకాశాలు ఏమీ రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్, రీల్ పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

త్వరలో బిగ్ బాస్ సీజన్ 8

ఇప్పటికే ఈ బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా మంచి ఆదరణతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇక తెలుగు విషయానికి వస్తే ఇప్పటికే 7 సీజన్లు పూర్తి కాగా, త్వరలోనే సీజన్ 8 మొదలు కాబోతోంది. ఇక ఈ సీజన్ కు హోస్ట్ గా నాగ్ తప్పుకుంటున్నాడని, బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీళ్లేనంటూ ఓ లిస్ట్ వైరల్ అవుతుంది. ఆ లిస్టు ప్రకారం చూసుకుంటే ఈసారి కూడా హౌస్ లో సీరియల్ నటీనటులే ఎక్కువగా కనిపించబోతున్నారని అనిపిస్తోంది. మరి బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు