Inaya Sultana: ప్రాణాలతో బయటపడాలని ప్రార్థించండి… బాయ్ ఫ్రెండ్ గురించి ఇనాయ పోస్ట్

Inaya Sultana : గత కొన్ని రోజుల నుంచి బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ ను నెటిజన్లకు పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ అతనితో కలిసి షికార్లు చేస్తున్న వీడియోలు, తన గ్లామరస్ వీడియోలతో నెటిజన్లను అలరిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బాయ్ ఫ్రెండ్ గౌతమ్ నిండు ప్రాణాన్ని కాపాడిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. మరి అసలు ఆ వ్యక్తికి ఏమైంది? ఇనాయ బాయ్ ఫ్రెండ్ చేసిన సాయం ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

నిండు ప్రాణాన్ని కాపాడిన గౌతమ్…

తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లోనూ ఈ భారీ వర్షాల కారణంగా రోడ్ల మీదకి నీళ్లు వచ్చి చేరడంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వాహనదారులు కూడా రోడ్లపైకి వచ్చినప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ వ్యక్తి హైదరాబాద్లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడి, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ వ్యక్తి రోడ్డు మీదే పడిపోయినా చుట్టూ జనాలు గుమిగూడారే తప్ప ఎవ్వరూ అతని దగ్గరికి వెళ్లే ధైర్యం చేయలేదు. అయితే అటువైపు నుంచి వెళ్తున్న ఇనాయ బాయ్ ఫ్రెండ్ గౌతమ్ వెంటనే స్పందించి, అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి ఓ నిండు ప్రాణాన్ని కాపాడాడు. దీంతో సోషల్ మీడియాలో గౌతమ్ సకాలంలో స్పందించడంపై నెటిజెన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇనాయా సోషల్ మీడియాలో గాయపడిన వ్యక్తి గురించి ప్రత్యేకంగా ఓ పోస్ట్ చేసింది.

Inayas boyfriend who saved a mans life what really happened Inaya Boyfriend: వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఇనయా బాయ్‌ఫ్రెండ్, నెట్టింట్లో వీడియో వైరల్

- Advertisement -

అతని గురించి ప్రార్థించండి…

ఇన్సిడెంట్ జరిగాక సోషల్ మీడియాలో ఆ వీడియోను షేర్ చేస్తూ నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడావు అంటూ ఇనాయ గౌతమ్ ను మెన్షన్ చేస్తూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఏం జరిగిందని ఫాలోవర్స్ ఆరా తీయగా, ఇద్దరూ కలిసి ఏం జరిగిందో వివరిస్తూ మరో వీడియోను షేర్ చేస్తారు. అందులో ఈ లవ్ బర్డ్స్ మాట్లాడుతూ రోడ్డు మీద వెళ్తుండగా యాక్సిడెంట్ వల్ల రక్తమోడుతూ పడిపోయిన ఓ వ్యక్తిని చూశాను. వెంటనే మా అమ్మ చున్నీ తీసుకుని రక్తం రాకుండా అడ్డుపెట్టాను. మరోవైపు ఇనాయ అంబులెన్స్ కు కాల్ చేసి ట్రాఫిక్ ని క్లియర్ చేసింది. మొత్తానికి అంబులెన్స్ వచ్చేదాకా అతన్ని మాట్లాడిస్తూ స్పృహలో ఉండేలా చూసుకున్నాము. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. తర్వాత హాస్పిటల్లో చేర్పించాము. అయితే అతని గురించి ఆరా తీయగా, పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టుగా తేలింది. కాబట్టి వర్షం పడుతున్నప్పుడు స్పీడ్ గా వెళ్లకుండా ఎంత జాగ్రత్త పాటిస్తే అంత మంచిది. ప్రస్తుతం ఆ గాయపడిన వ్యక్తి ప్రాణాలతో బయటపడాలని ప్రార్థించండి. అలాగే వర్షంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కేర్ ఫుల్ గా ఉండండి అంటూ అభిమానులకు ఇనాయ గౌతమ్ రిక్వెస్ట్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు