Indian 2 Controversy : ఇండియన్ 2 మేకర్స్ పై ఈ – సేవా సిబ్బంది కంప్లైంట్… వివాదం ఏంటంటే?

Indian 2 Controversy : ఇండియన్ 2 మూవీతో తాజాగా థియేటర్లలోకి వచ్చిన సేనాపతి తెరపైనే కాదు బయట కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాడు. తాజాగా E-Sewa అసోసియేషన్ సభ్యులు ఇండియన్ 2 మూవీ మేకర్స్ పై కంప్లయింట్ చేశారు. సినిమాలోని ఓ సన్నివేశం కారణంగా తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కొత్త వివాదానికి తెర తీశారు.

వివాదం ఏంటంటే?

జూలై 12న థియేటర్లలోకి వచ్చిన ఇండియన్ 2 మూవీ సుదీర్ఘమైన స్క్రీన్‌ప్లే, అనవసరమైన సీన్లతో మొదటి రోజే ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. దీంతో కలెక్షన్ల పరంగా మేకర్స్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అలర్ట్ అయిన మేకర్స్ 3-గంటల రన్‌టైమ్ ఉన్న ఒరిజినల్ మూవీ నుంచి కొన్ని సీన్స్ తీసేశారు. 12 నిమిషాల సీన్స్ ను ట్రిమ్ చేసి, మళ్లీ రిలీజ్ చేశారు. అయినప్పటికీ భారతీయుడు 2 బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడట్లేదు. చాలాచోట్ల ఇప్పటికే థియేటర్ల నుంచి ఈ మూవీని ఎత్తేశారు కూడా. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇండియన్ 2పై ఓ వివాదం రాజుకుంది.

Indian 2 Movie Review and Release Updates: Kamal Haasan, Shankar's  Bharateeyudu 2 Rating, Public Reactions and Box Office Collections | Times  Now

- Advertisement -

ఈసారి ఈ-సేవా సిబ్బంది తమ ఉద్యోగులు కొంతమంది సేవలను అందించడం కోసం జనాల నుండి లంచాలు తీసుకుంటున్నట్లు చిత్రీకరించిన ఒక నిర్దిష్ట సీన్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సీన్ వారి  ఆగ్రహానికి దారితీసింది. ఈ-సేవా సిబ్బంది ఇండియన్ 2 మేకర్స్‌పై తమ గురించి తప్పుగా చిత్రీకరించడంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సన్నివేశంలో తాము లంచం తీసుకున్నట్లు అన్యాయంగా చిత్రీకరించారని మండిపడ్డారు. తాము అలాంటి కార్యకలాపాలకు పాల్పడబోమని, అవినీతి ప్రపంచంలో ఇంతకంటే పెద్ద ఆటగాళ్లు ఉన్నారని బట్టబయలు చేయాలని వాదించారు. సమాచారం ప్రకారం పిర్యాదులో శంకర్ తమను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నాడని వారు పేర్కొన్నారు. అందుకే ఈ-సేవా అధికారులు తమిళనాడు ప్రభుత్వం జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరించాలని కోరారు.

ఇండియన్ 2తో భారీ నష్టాలు

శంకర్ దర్శకత్వం వహించిన ఇండియన్ 2లో ఉలగనాయగన్ కమల్ హాసన్ హీరోగా నటించారు. ఇండియన్ తరువాత దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సేనాపతి పాత్రలో ఆయన మరోసారి కన్పించారు. ఈ సీక్వెల్ లో ఏఆర్ రెహమాన్ బదులు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచందర్ ను తీసుకున్నారు. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన ఇండియన్ 2 మొదటి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా  స్క్రీన్ ప్లే దారుణంగా ఉందని, శంకర్ మార్క్ మిస్ అయ్యిందనే విమర్శలు విన్పించాయి. నెగెటివ్ టాక్ కారణంగా ఈ చిత్రం బాక్సాఫీస్ తమిళం, తెలుగు, హిందీతో సహా మూడు భాషల్లో మొదటి ఐదు రోజుల్లో కేవలం 65 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తుంటే ఇండియన్ 2 పని అయిపోయినట్టే అన్పిస్తోంది. ఇప్పటికే చాలా థియేటర్ల నుంచి ఈ సినిమాను ఎత్తేశారనే టాక్ నడుస్తోంది. అస్సలే మేకర్స్ ఇండియన్ 2తో భారీ నష్టాలు తప్పవు అనే టెన్షన్ లో ఉంటే తాజాగా మరో వివాదం తలకు చుట్టుకుంది. మరి ఈ-సేవా వివాదంపై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు