Indian 2 : సీఎం రేవంత్‌కు కమల్ జై కొట్టాడు… తప్పని పరిస్థితి మరీ

Indian 2 : విశ్వ నాయకుడు కమలహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు కమలహాసన్. కమల్ హాసన్ ఒక నట శిఖరం. ఎవరినైనా యాక్టింగ్ లో పోల్చాలి అని అంటే కమల్ హాసన్ను మించి పోతావని అంటుంటారు. తరుణ్ భాస్కర్ లాంటి దర్శకుడు కూడా ఈ నగరానికి ఏమైంది సినిమాలో ఆట్ కమలహాసన్ అంటూ కామెడీ చేశాడు. ఇకపోతే కమల్ హాసన్ తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా కూడా కే విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన స్వాతిముత్యం, సాగర సంగమం, శుభసంకల్పం వంటి సినిమాలు ఎప్పటికీ ఒక ప్రత్యేకమని చెప్పాలి.

అలానే కమలహాసన్ నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతూ వచ్చాయి. కమలహాసన్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పొచ్చు. ఇకపోతే శంకర్ లాంటి దర్శకుడు కూడా అపరిచితుడు సినిమాలో కమల్ హాసన్ ని, అమితాబ్ ను చూశాను కానీ నీలాంటి నటుడుని ఎక్కడా చూడలేదు అంటూ అని ఒక సందర్భంలో రాస్తాడు. ఇకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో కైనా డిజాస్టర్లు పడటం అనేది కామన్ గా జరుగుతూనే ఉంటుంది. అలా కమల్ హాసన్ కెరియర్ లో కూడా డిజాస్టర్ సినిమాలు పడ్డాయి.

అయితే రీసెంట్ గా కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ప్రస్తుతం కమలహాసన్ చేస్తున్న సినిమా ఇండియన్ 2. ఈ సినిమా జులై 12న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. చిత్ర యూనిట్. లేకపోతే రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చిత్ర యూనిట్ యాంటీ డ్రగ్స్ అంటూ ఒక వీడియోని చేసింది.

- Advertisement -

Kamal Haasan-Shankar's Indian 2

ఈ వీడియోలో కమల్ హాసన్ మాట్లాడుతూ డ్రగ్స్ ని, నార్కోటిక్స్ ని బ్యాన్ చేయాలి అని సూచిస్తూ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు కమల్ జై కొట్టారు. అయితే దీనిపై కొంతమంది సోషల్ మీడియాలో ఇప్పుడు సినిమా కోసం ఏం చెప్పినా చేయాలి తప్పదు మరి అంటూ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. వాస్తవానికి కమలహాసన్ కి సామాజిక బాధ్యత ఎక్కువగా ఉంది కాబట్టి కేవలం సినిమా కోసమే కాకుండా సమాజం కోసమే ఆయనలా వీడియో బయట చేశారని కొంతమంది అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు