Indian 2 Public Talk : భారతీయుడు 2 సినిమాలో శంకర్ చేసిన 11 మిస్టేక్స్… ఇవి లేకుంటే బ్లాక్ బస్టరే

Indian 2 Public Talk.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ ఇప్పుడు భారతీయుడు 2 పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమల్ హాసన్ హీరోగా.. ఎస్ జె సూర్య, ప్రియా భవానీ శంకర్ , కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్ , రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ కాళిదాసు, జయరాం, సముద్రఖని , బ్రహ్మానందం, జయప్రకాష్, మనోబాల, అశ్విని తంగరాజ్ , బాబి సింహ తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం ఇది. భారీ అంచనాల మధ్య డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో థియేటర్ల ముందుకు వచ్చింది..కానీ భారతీయుడు సినిమా రేంజ్ లో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా భారతీయుడు 2 సినిమాను తెరకెక్కించే క్రమంలో శంకర్ చేసిన 11 తప్పులు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. మరి శంకర్ చేసిన ఆ మిస్టేక్స్ ఏంటి ..? సినిమాలో గమనించిన ఆ తప్పులు ఏమిటి..? అనేది ఇప్పుడు చూద్దాం..

Indian 2 Public Talk : 11 mistakes made by Shankar in the movie Indian 2... otherwise it would have been a blockbuster..!
Indian 2 Public Talk : 11 mistakes made by Shankar in the movie Indian 2… otherwise it would have been a blockbuster..!

1) ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా కథను , కథనాన్ని రాయలేకపోవడం ప్రధానం తప్పిదం అని చెప్పవచ్చు.. ఆడియన్స్ ఒక సినిమా కథను విన్నప్పుడు ఎన్నో ఆశలతో థియేటర్లకు వస్తారు.. కానీ వారి ఆలోచనలకు పూర్తిస్థాయిలో శంకర్ భంగం కలిగించారనే చెప్పాలి.

2) భారతీయుడు.. టైటిల్ లోనే స్వాతంత్రం కోసం పోరాడే వీరుడు అని అర్థం.. అయితే ఇలాంటి అర్థం వచ్చే సినిమాలో యాక్షన్ సన్నివేశాలను సాగదీయడం మరో తప్పిదం అని చెప్పాలి.

- Advertisement -

3) గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం లాంటి క్యారెక్టర్లను వాడుకోకపోవడంలో శంకర్ విఫలం అయ్యారు.

4) పైగా నటనలో కోలీవుడ్లో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న బాబీ సింహా, ఎస్ జే సూర్య క్యారెక్టర్లను పార్ట్ 3 కోసం అని, ఇండియన్ 2లో పెద్దగా ఎలివేట్ చేయలేదు. తినబోయే వాటికోసం ఎదురు చూసేలా.. ఉన్న వాటిపై ఫోకస్ పెట్టలేకపోయారు.

5) పైగా ఈ పార్ట్ 2 కోసమే సపరేట్‌గా ఓ విలన్ ను తీసుకోవాల్సింది. కానీ అలా చేయలేదు.

6) భారతీయుడు వ్యక్తులను ఎందుకు చంపుతున్నాడు అనే విషయంలో క్లారిటీ లేదు.. వాళ్లు అవినీతి చేసి కోట్లు సంపాదించారు అని తెలుస్తుంది.. కానీ వారి నేపథ్యం ఏమిటి..? వారు ఎందులో అవినీతి చేశారు ..? అనే విషయాలపై కాస్త క్లారిటీ ఇవ్వాల్సింది.

7) వందల మంది సెక్యూరిటీ ఉన్నా.. భారతీయుడు చాలా సులభంగా ఇంట్లోకి వెళ్లి చంపేస్తాడు. ఎలా అనేది ఎవరికీ తెలీదు. ఇంత టెక్నాలజీ ఉన్నా.. ఒక వ్యక్తి ఎవరికీ తెలియకుండా, అందులోనూ సీబీఐ లాంటి వాటి నుంచి తప్పించుకుని అన్ని రాష్ట్రాలు తిరగడం సాధ్యమేనా…? ఇలాంటి లాజిక్స్ మిస్ అయ్యాయి. ఇవి కాస్త చూసుకోవాల్సింది.

8) సినిమా ప్రారంభంలో హీరో వస్తాడు అంటూ 30 నిమిషాల పాటు హైప్ క్రియేట్ చేశారు… దీని వల్ల ఆసక్తితో చూసిన ఆడియన్స్ చాలా డిస్పాయింట్ అయ్యారు. స్టార్టింగ్ లోనే హీరో ఎంట్రీ ఇచ్చింటే కొంచెం సినిమా ఆపై హైప్ పెరిగి ఉండేదేమో.

9) సినిమా కథ 3 గంటలు కాకుండా.. 2:30 గంటల్లోనే సినిమాను క్లోజ్ చేయాల్సింది.

10) పైగా ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ను కాకుండా.. మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుధ్‌ను తీసుకోవడం. కూడా సినిమాకి మైనస్ అని చెప్పుకోవచ్చు.

11) మెయిన్‌గా ఇండియన్ 2 ను మాత్రమే ఒక సినిమాగా తీస్తే సరిపోయేది. కానీ, దీన్ని ఇండియన్ 3కి కనెక్ట్ చేసేలా చూశారు. అదే ఇంకా పెద్ద మిస్టేక్. ఇవన్నీ లేకుండా ఉండి ఉంటే సినిమా మరోలా ఉండేదేమో.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు