Indian 2: ఇండియన్ 2 రెండవ సింగిల్ ప్రోమో రిలీజ్.. ఫుల్ సాంగ్ కి ముహూర్తం ఖరారు..!

Indian 2: విశ్వ నటుడు కమల్ హాసన్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో లేటెస్ట్గా వస్తున్న మూవీ భారతీయుడు 2. బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడు చిత్రం కు ఈ మూవీ సీక్వెల్ గా రూపొందుతుంది. ఇక ఈ సినిమా ను లైకా ప్రొడక్షన్స్ వారు రెడ్ బెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిది స్టాలిన్ , సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇక ఈ మూవీలో కాజల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా బాబి సింహ, ఎస్ జె సూర్య వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. మేకర్స్ ఈ సినిమాను జూలై 12న గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ వీడియో, పోస్టర్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి.

ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. శౌర అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సిద్ధార్థ్, రకుల్ మధ్య చంగలువ అంటూ సాగే లవ్ సాంగ్ ప్రోమో మేకర్స్ నేడు సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఈ సినిమా ఆడియో లాంచ్ న్యూ మేకర్స్ జూన్ 1 గ్రాండ్గా నిర్వహించనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు