Indian 2: అనవసరంగా బడ్జెట్ ఎక్కువ పెట్టించే శంకర్ దగ్గరకి సేనాపతి రావాలి

Indian 2: కొందరు దర్శకులు ఎప్పుడూ చాలా గొప్పగా ఆలోచిస్తారు. సమాజం ఇలా ఉండాలి అని కలలు కంటారు. సమాజం అలా లేనప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది అని ఊహల్లో నుంచి ఒక కథ పడుతుంది. అలాంటి కథ భారతీయుడు కావచ్చు, జెంటిల్మెన్ కావచ్చు, శివాజీ కావచ్చు, రోబో కావచ్చు ఇన్ని సినిమాలు ప్రస్తావించిన తర్వాత మీ అందరికీ ఇప్పటికే శంకర్ గుర్తొచ్చి ఉండొచ్చు. అవును ఇప్పుడు అంతా పాన్ ఇండియా పాన్ ఇండియా అని అనుకుంటున్నారు కానీ ఒకప్పుడు శంకర్ సినిమాలే పాన్ ఇండియా కాన్సెప్ట్ లు. పేరుకు తమిళ్ దర్శకుడు అయినా కూడా ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ కావడం వలన శంకర్ సినిమా మీద తెలుగు ప్రేక్షకులకు కూడా విపరీతమైన అంచనాలు ఉండేవి.

ఇకపోతే శంకర్ తీసిన చాలా హిట్ సినిమాలలో భారతీయుడు ఒకటి. ఈ సినిమాలో అవినీతిని నిర్మూలిస్తూ లంచం తీసుకునే వారిని శిక్షిస్తూ ఉంటాడు ఈ సినిమాలో క్యారెక్టర్ అయినా సేనాపతి. శంకర్ సినిమాలలో శంకర్ క్రియేట్ చేసిన పాత్రలలో సేనాపతి పాత్రకి ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్టేటస్ ఉంటుంది. అంతా అద్భుతంగా సేనాపతి అనే పాత్రను డిజైన్ చేశాడు శంకర్. ఇక భారతీయుడు సినిమా విషయానికి వస్తే ఆ సినిమాలో ఎమోషన్స్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని డైలాగ్స్ సినిమాకు చాలా పెద్ద ప్లస్ అయ్యాయి. మరి భారతీయుడు టు విషయానికి వస్తే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు అని సోషల్ మీడియాలో చాలామంది చెబుతూ వస్తున్నారు.

Indian is back

- Advertisement -

మామూలుగా సేనాపతి లాంటి క్యారెక్టర్ రియల్ లైఫ్ లో కూడా ఊహించడం కష్టం. ఇప్పటికీ చాలామంది లంచం తీసుకుంటున్నారు కాబట్టి ఇండియన్ టు సినిమాని తెరకెక్కించాను అంటూ శంకర్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. అలానే సమాజంలో చాలా అవినీతి కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇదే విషయానికొస్తే శంకర్ ను మరోరకంగా కూడా కొంతమంది ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. భారతీయుడు 2 సినిమా నిరుత్సాహపరచడంతో అనవసరంగా ఒక సినిమా కోసం ఎక్కువ ఖర్చు పెట్టించటం కూడా ఒక అవినీతి అవుతుంది. ఇలాంటి వాళ్ళ దగ్గరికి కూడా సేనాపతి వచ్చి శిక్షిస్తే ఎలా ఉంటుంది అని ఫన్నీ వే లో సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు