Indian 2: ఆన్లైన్లో అదరగొడుతున్న ఇండియన్ 2 సాంగ్స్.. అనిరుధా మజాకానా..!

Indian 2: యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న తాజా మూవీ ” ఇండియన్ 2 “. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ మూవీ కి సీక్వెల్ గా ఇండియన్ 2 రాబోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, సింగిల్ సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హైప్స్ క్రియేట్ చేశాయి.

ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ నేడు అంగరంగ వైభోగంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఇక తాజాగా ఇండియన్ 2 టీమ్ ఆడియో జూక్ బాక్స్ ను ఆన్లైన్లో రిలీజ్ చేశారు.‌ ఈ మేరకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఓ ట్వీట్ కూడా చేశారు. ” ఇకపై ఇండియన్ 2 ఆల్బమ్ మీదే ” అంటూ అనిరుద్ కామెంట్స్ చేయడం జరిగింది. దీంతో కమల్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Indian 2 second single promo release.. Full song finalised
Indian 2 second single promo release.. Full song finalised

తమ అభిమాన హీరో సినిమాలోని పాటలను వింటూ వారు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ పాటలు సోషల్ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. ఇక ఈ పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండటం విశేషం. ఇక ఈ చిత్రంలో కమల్ హాసన్ మరో సారి సేనాపతి పాత్రలో అదరగొట్టేందుకు రెడీ అయ్యారు. కాగా యంగ్ హీరో సిద్ధార్థ్ ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, బాబీ సింహ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు