Indian 2: సినిమాను కచ్చితంగా చూడడానికి 5 ప్రధాన కారణాలు ఇవే..?

Indian 2.. డైరెక్టర్ శంకర్, కమలహాసన్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్-2 సినిమా భారీ హైప్స్ తో రాబోతోంది.. ఈ సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.. కమల్ – శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఇండియన్-2 సినిమాను తెరకెక్కించారు. మొదటి భాగంలో కమలహాసన్ స్వాతంత్ర సమరయోధుడిగా, అవినీతికి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా కనిపించడం జరిగింది.చివరికి అన్యాయం, లంచగొండితనం చేసే తన కన్న కొడుకుని కూడా వదిలిపెట్టలేని ఒక పెద్దాయన పాత్రలో నటించారు.

Indian 2: These are the 5 main reasons to watch the movie for sure..?
Indian 2: These are the 5 main reasons to watch the movie for sure..?

ఈసారి భారతీయుడు-2 సినిమాలో.కమలహాసన్ పాత్ర మరింత ఎక్కువగా పెంచినట్లు తెలుస్తోంది.. భారతీయుడు-2 లో ప్రస్తుతం ఉన్న అవినీతితో పాటు టెక్నాలజీ కథాంశాలు కూడా యాడ్ చేసినట్లుగా తెలుస్తోంది. కమలహాసన్ యాక్షన్ సన్నివేశాలు కూడా ఆడియన్స్ ని సైతం భయపెట్టేలా ఉండబోతున్నాయట. అయితే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూడడానికి ముఖ్య కారణం కమలహాసన్ అట..

ఇందులో కమల్ హాసన్ నటన , డైరెక్టర్ శంకర్ దర్శకత్వం కాబట్టి ఈ సినిమా కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

ఇటీవల విడుదలైన ట్రైలర్లో కూడా కమలహాసన్ యాక్షన్ సన్నివేశాలకు మించి మరీ హైలెట్స్ చూపించారు.లవ్ , సెంటిమెంట్ వంటి అంశాల గురించి కూడా చూపించడం జరిగింది.

ఇండియన్-2 లో మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. ఇందులో హీరో సిద్ధార్థ్ ఎప్పుడు చేయని ఒక పాత్రలో నటించబోతున్నారట. ముఖ్యంగా 21 ఏళ్ల తర్వాత శంకర్ డైరెక్షన్లో సిద్ధార్థ్ నటించడం గమనార్హం.

మరోవైపు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమా మొదటి నుంచి క్లైమాక్స్ వరకు సిద్ధార్థ్ పాత్ర కమలహాసన్ పాత్ర ముడిపడి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రం చూడడానికి మరొక కారణం ఏమిటంటే మ్యూజిక్ ని అనిరుద్ అందించడం. ఇండియన్ సినిమాకి మొదట ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. అప్పట్లో పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇండియన్-2 చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించమని అడగగా తాను బిజీగా ఉండడం చేత ఒప్పుకోలేదట.

ఇక ఈ సినిమాను చూడడానికి మరొక కారణం..ఏమిటంటే..డైరెక్టర్ శంకర్ ఈ చిత్రంలో భారీ తారగాన్ని సమకూర్చారు.. కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీతిసింగ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహ, మనోబాల , ఎస్ జె సూర్య, వివేక్ తదితర సెలబ్రిటీలను తీసుకోవడం గమనార్హం. వారందరిని కూడా డిఫరెంట్ పాత్రలలో చూపించబోతున్నారు.

ఇలా మొత్తానికైతే ఈ అంశాలన్నీ కూడా ఇండియన్ 2 సినిమాను చూడడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఇకపోతే కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో నటిస్తోంది అంటూ గతంలో చెప్పారు కానీ ఈ సినిమా ట్రైలర్ లంచ్ ఈవెంట్లో కాజల్ అగర్వాల్ నటించడం లేదని.. ఇండియన్ 3 సినిమాలో ఆమె షూటింగ్ భాగం ఉంటుంది అని డైరెక్టర్ నిరాశపరిచారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు