Indian 2 : ఇది భారతీయుడికి సీక్వెల్ కాదు… బాలయ్య సినిమాకు సీక్వెల్

Indian 2 : ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ అంటే సుకుమార్ రాజమౌళి త్రివిక్రమ్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు సౌత్ లో టాప్ డైరెక్టర్ అంటే వినిపించే పేరు శంకర్. శంకర్ సినిమాలు ఎవరి ఊహకు అందని రేంజ్ లో ఉండేవి. తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు శంకర్. ఇప్పటికి కూడా శంకర్ సినిమాలను చూస్తే ఆ టైంలో ఈ సినిమాను ఎలా తీయగలిగారు అని ఆశ్చర్యపరిచేలా కూడా ఉంటాయి. ఇకపోతే శంకర్ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా భారతీయుడు 2. భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు శంకర్.

దాదాపు 2017లో మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదలైనప్పటినుంచి ఎన్నో అవంతరాలు ఎదురవుతూ వచ్చాయి. ఒకసారి సెట్ లో అగ్ని ప్రమాదం కూడా జరిగింది. ఈ సినిమా షూటింగ్లో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా చనిపోయారు. ఇకపోతే ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా నేడు ప్రేక్షకులను నిరాశపరిచింది. శంకర్ నుంచి ఇటువంటి వర్క్ ని ఎవరు ఊహించలేదు కూడా. అయితే ఈ సినిమాని నందమూరి బాలకృష్ణ తీసిన ఒక సినిమాతో ప్రస్తుతం సోషల్ మీడియాలో పోలుస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం హిట్ ట్రాక్

నందమూరి నరసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ టైమ్స్ లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన సినిమాలు తో మంచి హిట్స్ అందుకొని ఆ తర్వాత హిట్ ట్రాక్ లో వచ్చి వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు బాలకృష్ణ సినిమాలు మంచి ట్రోల్ కంటెంట్ గా ఉండేవి. రీసెంట్ గా ఇప్పుడు మరో సినిమాను కూడా తెరపైకి తీసుకొచ్చారు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా ఒక్కమగాడు. ఈ సినిమా వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. దీనికి కారణం శంకర్ తెరకెక్కించిన ఇండియన్ 2 సినిమా ఈరోజు రిలీజ్ కావటం.

- Advertisement -

Okka Magaadu

ఇది భారతీయుడు సీక్వెల్ కాదు

ఒక్కమగాడు సినిమా భారీ డిజాస్టర్ గా ఆ రోజుల్లో పేరు సాధించింది. ఇప్పుడు ఇండియన్ 2 సినిమా కూడా దాదాపు అలానే ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి భారతీయుడు వంటి కల్ట్ క్లాసిక్ సినిమాకి ఇది సీక్వెల్ కాదని, నందమూరి బాలకృష్ణ ఒక్కమగాడు సినిమాకి ఇది సీక్వెల్ అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు