Indian -2 Trailer launch: షారుఖ్ రెమ్యునరేషన్ పై కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్..!

Indian 2:.. 1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు భారతీయుడు 2 సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే.. జూలై 12 వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి ముస్తాబ్ అవుతోంది. ఇందులో కమల్ హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.. ఈ తరుణంలోనే చిత్ర బృందం ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇక ఈవెంట్ కూడా చాలా ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కమల్ హాసన్ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ రెమ్యునరేషన్ పై ఒక ఆసక్తికర విషయం చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది..

షారుఖ్ ఖాన్ మంచి వ్యక్తి – కమల్ హాసన్

Indian-2 Trailer launch: Kamal Haasan's shocking comments on Shahrukh's remuneration..!
Indian-2 Trailer launch: Kamal Haasan’s shocking comments on Shahrukh’s remuneration..!

2000వ సంవత్సరంలో “హే రామ్” సినిమాలో షారుఖ్ , కమల్ హాసన్ కలిసి నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం షారుక్ ఖాన్ ఒక రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు కమల్ హాసన్.. ఇక షారుఖ్ మంచి నటుడు అని స్నేహితుల కోసం రూపాయి కూడా తీసుకోకుండా పనిచేస్తారు అని స్పష్టం చేశారు. ఇకపోతే హే రామ్ సినిమాను తమిళం, హిందీలో ద్విభాషా చిత్రంగా రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో సాకేత్ రామ్ పాత్రను కమల్ హాసన్ పోషించగా.. ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ లో అంజాద్ అలీఖాన్ క్యారెక్టర్ చేశారు షారుఖ్ ఖాన్.. పైగా ఈ చిత్రానికి కమల్ హాసన్ దర్శకత్వం వహించడం గమనార్హం.. ఇకపోతే ఒక సినిమా కోసం పనిచేసేటప్పుడు స్టార్ , సూపర్ స్టార్ లాంటి టైటిల్ అనవసరం అని స్పష్టం చేశారు.

స్టార్, సూపర్ స్టార్ ట్యాగ్ పై కమల్ రెస్పాన్స్..

షారుఖ్ ఖాన్ గురించి ప్రస్తావిస్తూ మేము కలిసి పనిచేస్తున్నప్పుడు మేమంతా కేవలం సాధారణమైన వ్యక్తులమే.. ఏ రోజు కూడా నేను ఒక సూపర్ స్టార్ అని భావించను.. సూపర్ డైరెక్టర్ కూడా అనుకోను.. మేమంతా స్నేహితులం.. షారుఖ్ ఖాన్ ఆ సినిమాను ఉచితంగా చేశారు.. నేను సూపర్ స్టార్ అనుకొని ఉంటే ఆయన అలా చేసేవారు కాదు.. సినిమా అభిమానులే అలా చేయగలరు.. ఒక మంచి మనసున్న వ్యక్తి.. ఆయన ఒక గొప్ప నటుడు.. ఆయనకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను.. మాకు ఆ తర్వాత మీరే టైటిల్స్ ఇస్తారు.. మేము మొహమాటంగానే అంగీకరిస్తాము అంటూ కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.. మొత్తానికి అయితే షారుఖ్ ఖాన్ మంచితనాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ కమల్ హాసన్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

ఇండియన్ -2

ఇండియన్ 2 విషయానికి వస్తే.. ఇందులో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ , కాజల్ అగర్వాల్, ఎస్.జె.సూర్య, వివేక్, బాబీ సింహ, ప్రియా భవాని శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని , మనోబాల, ఢిల్లీ గణేష్ తదితరులు కీలక పాత్రలు చేశారు.. లైకా ప్రొడక్షన్స్ , రెడ్ జెయింట్స్ మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించారు. జూలై 12వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది ఈ సినిమా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు