Indian 2: ఆర్.ఆర్.ఆర్ టీం తో

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్,కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్ 2.శంకర్ డైరెక్షన్ లో భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా తెరకేక్కుతున్న ఇండియన్ 2 కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో కలవకళ్ల సుందరి కాజల్ అగర్వాల్ ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. బాబీ సింహ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్-రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిది, స్టాలిన్, సుభాష్కరన్ నిర్మిస్తున్న ఇండియన్ 2 చిత్రానికి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఇండియన్ 2 లుక్ సినిమాపై అంచనాలు అమాంతం.

అయితే, కమల్-శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ ఇటీవల చెన్నైలో జరిగింది. తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ తిరుపతిలో ప్రారంభమైందట. మరి ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొనగా లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ సాంగ్ కోసం శంకర్ RRR నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్ ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

శంకర్ సినిమాలో సాంగ్స్ ఏ లెవెల్ లో ఉంటాయో తెలిసిందే. అలా ఈ సినిమాలో ఓ కీలక సాంగ్ కోసం గాను RRR నుంచి ఆస్కార్ కి ఎంపికైన నాటు నాటు కొరియోగ్రాఫర్ ఫ్రేమ్ రక్షిత్ మాస్టర్ ని అయితే శంకర్ తీసుకున్నట్టుగా ఇప్పుడు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి వీరి కలయికలో ఆ సాంగ్ ఎంత గ్రాండ్ గా ఉంటుందో చూడాలి. కాగా శంకర్ మరోవైపు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న ఆర్సి15 షూటింగ్ తో కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. కమల్ హాసన్ మరోవైపు మణిరత్నం డైరెక్షన్ లో 234వ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు