Indian Telly Streaming Awards 2024: విజేతలుగా నిలిచిన టాప్ స్టార్స్ వీళ్లే..!

Indian Telly Streaming Awards 2024..
భారతదేశ బుల్లితెర నటులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియన్ టెలీ స్ట్రీమింగ్ 2024 అవార్డుల వేడుక శుక్రవారం చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.. రెడ్ కార్పెట్ పై నడిచి తమ హుందాతనాన్ని చూపించుకున్నారు. ఇకపోతే ఈ అవార్డ్స్ లో భాగంగా రానా నాయుడు వెబ్ సిరీస్ కి గాను టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటికి బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. అయితే ఆయన ఈ వేడుకకు హాజరు కాకపోవడంతో ఈ వెబ్ సిరీస్ ను దర్శకత్వం వహించిన కరన్ హన్షుమాన్ రానా తరపున అవార్డు అందుకోవడం గమనార్హం. ఇకపోతే ఈ ఇండియన్ టెలీ స్ట్రీమింగ్ 2024లో భాగంగా ఎవరెవరు అవార్డులను సొంతం చేసుకున్నారు అనే పూర్తి జాబితా ఇప్పుడు చూద్దాం.

Indian Telly Streaming Awards 2024: These are the top stars who won..!
Indian Telly Streaming Awards 2024: These are the top stars who won..!

ఇండియన్ టెలీ స్ట్రీమింగ్ అవార్డ్స్ 2024 రెడ్ కార్పెట్ పై సుస్మితసేన్ , అభిషేక్ మల్హాన్, కరన్ కుంద్ర, ప్రియాంక చోహర్ చౌదరి , అభిషేక్ బెనర్జీ మరియు ఇషా మాల్వియా లాంటి తదితరులు ఈ రెడ్ కార్పెట్ ను అలంకరించి మరింత వెలుగులు తీసుకొచ్చారు. ముఖ్యంగా సుస్మిత సేన్ నలుపు రంగు దుస్తుల్లో మరింత ఆకర్షణీయంగా కనిపించగా ఆమెతోపాటు బ్యూటీ రోహ్మన్ షాల్ కూడా కనిపించింది ..ఆమె కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు ఇందులో ఆకాంక్ష పూరీ, రసికా దుగల్, కరణ్ వీర్ శర్మ, సుమీత్ వ్యాస్ మరియు హన్సల్ మెహతా తదితరులు ఈ వేదికపై కనిపించారు. ఇకపోతే ఎవరెవరు ఈ అవార్డులను దక్కించుకున్నారు అనే విషయానికి వస్తే..

ఉత్తమ నటి – తాలీ – సుస్మితసేన్

- Advertisement -

ఉత్తమ నటుడు – స్కాం 2003 – గగన్ రియర్ – ది తెల్గీ స్టోరీ..

ఉత్తమ నాటకం – హిందీ – ట్రయల్ బై ఫైర్ ( నెట్ ఫ్లిక్స్)

ఉత్తమ నటి – హిందీ కామెడీ షో యువర్స్ 3 – సుమీత్ వ్యాస్

ఉత్తమ డాక్యుమెంటరీ – తమిళ చిత్రం – ది ఎలిఫెంట్ విస్పరర్స్

ఉత్తమ యూత్ స్టోరీ – హిందీ సినిమా – ఆఫ్ సీఏ

ఎడిటర్ ఎంపిక – ఓటిటి రియల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ – బిగ్బాస్ ఓటిటీ 2 అభిషేక్ మల్హాన్.

ఉత్తమ సహాయ నటి – లస్ట్ స్టోరీస్ 2 – తిలోటమా షోమ్

ఉత్తమ సహాయ నటుడు – హిందీ మూవీ కొహ్ర – బరుణ్ సోబ్తి

ఉత్తమ నటి – హుమా ఖురేషి మౌనిక, ఓ మై డార్లింగ్

పబ్లిక్ ఛాయిస్ – ఉత్తమ సిరీస్ – ది నైట్ మేనేజర్

ఉత్తమ రియాలిటీ షో -టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా

ఉత్తమ దర్శకుడు – మౌనిక మూవీ కోసం వాసన్ బాలా, ఖో గయే హాం కహాన్ చిత్రానికి ఓ మై డార్లింగ్ మరియు అర్జున్ వరైన్

ఉత్తమ కథ – లస్ట్ స్టోరీస్ 2 – ది మిర్రర్

ఉత్తమ ప్రాంతీయ చిత్రం – తమిళ్ – పోర్ తోజిల్

ఉత్తమ దర్శకుడు – పోర్ తొజిల్ – విగ్నేష్ రాజా

ఎడిటోరియల్ ఎంపిక : అభిషేక్ బెనర్జీ

ఉత్తమ నటుడు : పోర్ తోజిల్ – ఆర్ శరత్ కుమార్

ఉత్తమ చిత్రం -హిందీ – డార్లింగ్స్

ఉత్తమ సహాయ నటి – ఢిల్లీ క్రైమ్ సీజన్ టు – రసిక్ దుగ్గల్

ఉత్తమ కామిక్ షో – పర్మనెంట్ రూమ్ మేట్స్ S 3

పబ్లిక్ ఛాయిస్ – ఉత్తమ నటుడు – రానా నాయుడు సిరీస్ – రానా దగ్గుబాటి

ఉత్తమ యాక్షన్ థ్రిల్లర్ మూవీ – ధూత

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు