Indian2 : భారతీయుడు2 హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఆ రోజునే? అది కరెక్ట్ టైం ఎందుకంటే?

Indian2 : లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇండియన్2 మరో నెల రోజుల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. పాతికేళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్2 సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ తో పాటుగా కాజల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, అలాగే ఎస్.జె. సూర్య, బాబీ సింహ వంటి తారాగణం నటించిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక శంకర్, కమల్ హాసన్ ఆఫ్టర్ లాంగ్ టైం కలిసి చేస్తున్న ఈ సూపర్ హిట్ సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉండగా, వచ్చిన టీజర్, సాంగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసాయి. ఫైనల్ గా జులై 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా తెలుగులో భారతీయుడు2 పేరుతో విడుదల కానుంది. అయితే కొన్ని రోజుల కిందట ఇండియన్2 ప్రీ రిలీజ్ ఈవెంట్ తమిళ్ లో గ్రాండ్ గా నిర్వహించడం జరిగింది. కానీ ఆ తర్వాత శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ పై ఫోకస్ పెట్టాడు. ఇదిలా ఉండగా ఇండియన్2 (Indian2) తెలుగు ఈవెంట్ కి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది.

Indian2 movie hyderabad pre release event update

భారతీయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆరోజున?

అయితే ఇండియన్2 షూటింగ్ మొత్తం పూర్తయ్యాక చైన్నైలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించడం జరిగింది. అయితే తెలుగులో మాత్రం ఇప్పటివరకూ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు. శంకర్ గేమ్ చేంజర్ షూటింగ్ లో బిజీ అయ్యాడు. అయితే తాజాగా భారతీయుడు2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి తాజా సమాచారం వచ్చింది. భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో జూన్ 30న నిర్వహించే అవకాశం ఉందని లేటెస్ట్ గా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఆ డేట్ కరెక్ట్ ని నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే దానికి మూడు రోజుల ముందే కమల్ కీలక పాత్ర లో నటించిన కల్కి2898AD కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి, ఆ ఊపులో కమల్ హాసన్ సినిమాకి మరింత ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ వార్తల్లో ఎంత వరకూ నిజముందో క్లారిటీ రావాలి.

- Advertisement -

కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ పై కన్నేసిన కమల్..

ఇక ఇండియన్ 2 (Indian2) సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా తో రికార్డు ఓపెనింగ్స్ కొల్లగొట్టాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే రెండేళ్ల కింద అసలేమాత్రం ఫామ్ లో లేని కమల్ హాసన్ ఖాతాలో విక్రం తో సెన్సేషనల్ హిట్ పడేలా చేశాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. కమల్ కెరీర్ కు విక్రమ్ బ్లాక్క్ బస్టర్ హిట్ ఇచ్చిన బూస్టింగ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా 450 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి కమల్ బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసింది. అయితే ఇప్పుడు ఇండియన్ 2 తో కూడా కమల్ హాసన్ మళ్లీ అదే టార్గెట్ తో వస్తున్నాడని తెలుస్తుంది. ఇండియన్ సినిమా అప్పట్లోనే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. అప్పట్లో ఇండియా లోనే హైయెస్ట్ గ్రాసర్ లలో ఒకటిగా నిలిచింది. ఇక ఆ సినిమా సీక్వెల్ గా వస్తున్న ఇండియన్ 2 ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెబుతున్నారు. అయితే బిజినెస్ పరంగా కమల్ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఇండియన్ 2 బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. ఇక ఇండియన్2 ఫస్ట్ డే 100 కోట్ల ఓపెనింగ్స్ తెచ్చుకునేలా మేకర్స్ ప్రమోషన్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు