Indian2 : కల్కికి కలిసొచ్చింది.. కానీ ఇండియన్2 కి మైనస్ అవుతుందా?

Indian2 : లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇండియన్2 జులై12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా పై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. పాతికేళ్ల తర్వాత శంకర్ కమల్ హాన్ కాంబినేషన్ లో సినిమా రావడం అది కూడా ఇండియన్ మూవీ కి సీక్వెల్ గా రావడంతో మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ గాని, ట్రైలర్ సహా పాటలు కూడా సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి. ఫైనల్ గా ప్రమోషన్లలో చిత్ర యూనిట్ తెగ బిజీగా ఉంది. మరో వారం రోజుల్లో ఇండియన్2 థియేటర్లలో సందడి చేయబోతుంది. ఇక ఈ సినిమాని తెలుగులో భారతీయుడు2 పేరుతో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

Indian2 movie will have a long run time minus?

ఇండియన్2 కి ఈ విషయంలో మైనస్ అవుతుందా?

ఇక మరో వారం రోజుల్లో ఇండియన్2 (Indian2) పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా నిడివిపై నెట్టింట చర్చ నడుస్తుంది. శంకర్ రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ ఇండియన్2 మూవీ దాదాపు 182 నిమిషాల (3 గంటలు) రన్‌టైమ్‌ను కలిగి ఉందట. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సినిమా ఫలితాన్ని నిర్ణయించడంలో మూవీ యొక్క రన్‌టైమ్ కూడా అత్యంత కీలకమైన అంశాలలో ఒకటిగా మారింది. కొన్ని సినిమాల కాన్సెప్ట్ బాగున్నా ల్యాగ్ ఎక్కువ అవడం వల్ల ప్లాప్ అయ్యాయన్న వార్తలు కూడా ఉన్నాయి. అయితే మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయగలిగితే రన్ టైం కూడా పెద్దగా పట్టించుకోరు ఆడియన్స్. ఇక రీసెంట్ గా వచ్చిన కల్కి2898AD రన్ టైం కూడా 3 గంటల నిడివి (178 నిమిషాలు) కలిగి ఉంది. అయితే ప్రభాస్ నటించిన ఈ సినిమాలో కథ విషయంలో ఎన్నో ప్లస్ పాయింట్స్ ని కలిగి ఉంది. అందువల్ల సుదీర్ఘమైన రన్‌టైమ్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.

- Advertisement -

ఇండియన్2 మెప్పిస్తాడా?

అయితే భారతీయుడు2 సినిమా విషయానికి వస్తే, దేశంలో ఉన్న అవినీతిని తొలగించడానికి చిత్ర కథానాయకుడు అన్ని పోరాటం చేసే సినిమా ఇది. ఇండియన్ మొదటి పార్ట్ లో ఆల్రెడీ మనం ఈ కథ మొత్తం చూసిందే. ఇప్పుడు అదే కథకి కంటిన్యూ గా వస్తుంది. కాబట్టి కాన్సెప్ట్ మొత్తం ప్రేక్షకులకి ముందే అర్ధం అవుతుంది. అయితే ప్రేక్షకులను కట్టిపడేయడానికి సినిమాకు ముందుగా అనవసరమైన సీన్లు ఉండకుండా ల్యాగ్ ఫీలింగ్ రాకుండా చేయాలి. ఒకటి రెండు సీన్లు ఉన్నా ప్రేక్షకులు అవి పెద్దగా పట్టించుకోకుండా చూసే స్ట్రాంగ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కావాలి. మరి ఈ విషయాన్ని శంకర్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ఏది ఏమైనా మరో వారం రోజుల్లో ఇండియన్2 వ్యవహారం తెలిసిపోతుంది. మరి కల్కి కి కలిసొచ్చిన రన్ టైం ఇండియన్2 కి కూడా కలిసొస్తుందా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు