Indra 4K: త్రివిక్రమ్ ను ఇన్స్పైర్ చేసిన ఇంద్ర సీన్స్, గురూజీ యాజ్ ఇట్ ఈజ్ దించారు

Indra 4K: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. రచయితగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దర్శకుడుగా సూపర్ హిట్స్ అందుకుని ఒక స్టార్ డైరెక్టర్ అయిపోయాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక త్రివిక్రమ్ కెరియర్ లో ఎక్కువ సినిమాలు స్టార్ హీరోస్ తో మాత్రమే చేసాడు. త్రివిక్రమ్ సినిమాలు చూసినప్పుడు చాలామంది ఈ సీన్ ఇక్కడి నుంచి కాపీ కొట్టాడు అని అంటూ ఉంటారు. మాక్సిమం హాలీవుడ్ సినిమాస్ నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ కాపీ కొట్టాడు అని ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. అయితే దీనికి ఇన్స్పిరేషన్ అని మరో పేరుని పెడుతుంటారు త్రివిక్రమ్ అభిమానులు.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా జల్సా. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ కి మంచి కం బ్యాక్ ఫిలిం అయింది. ఇప్పటికే ఈ సినిమాకి మంచి కల్ట్ స్టేటస్ ఉంది. సంజయ్ సాహు క్యారెక్టర్ ను త్రివిక్రమ్ డిజైన్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం స్నేహంగా మారి బలబడింది. అయితే ఈ సినిమాలో ఇంద్ర సినిమాలోని ఒక సీన్ ని ఇన్స్పైర్ త్రివిక్రమ్ చేశాడు అని అనిపిస్తూ ఉంటుంది.

Chiranjeevi

- Advertisement -

సంజయ్ సాహు క్యారెక్టర్ భాగమతిని ప్రేమిస్తుంది. అయితే భాగమతి కొన్ని సిచ్యువేషన్స్ వలన ఇంట్లో వేరే పెళ్లికి ఒప్పుకుంటుంది. ఇక ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఒక మంచి సంబంధాన్ని సెట్ చేసాను అంటూ శివాజీని తీసుకొచ్చి ఇలియానా కు ఇచ్చి పెళ్లి చేసుకునే తరుణంలో ముఖేష్ ఋషి ఎంట్రీ ఉంటుంది. అయితే ముఖేష్ ఋషి కొడుకు శివాజీ అని అప్పుడు రీవిల్ అవుతుంది. అయితే ఇదే సీన్ ఇంద్ర సినిమాలో కూడా ఉంటుంది అక్కడ కూడా శివాజీ , ముకేశ్ ఋషి తండ్రి కొడుకులుగా కనిపిస్తారు. ఇంద్ర సినిమా చూసి త్రివిక్రమ్ ఇన్స్పైర్ అయ్యారు అని చెప్పొచ్చు. ఇకపోతే ఇదే విషయం గురించి బి.గోపాల్ ను రెస్పాన్స్ అడిగినప్పుడు ఆయన పెద్దగా స్పందించలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు