Indra: మెగా ఫ్యాన్స్ డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు

Indra: రీసెంట్ టైమ్స్ లో కొన్ని సినిమాలను థియేటర్లో చూడలేకపోయాం అని అనుకోకుండా రీ రిలీస్ చేయడం మొదలుపెట్టారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక్కడు అనే సినిమాని ముందు రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. అదే తరుణంలో పోకిరి సినిమాను కూడా రిలీజ్ చేశారు. మహేష్ బాబు కెరియర్ లో ఈ రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం మహేష్ బాబు అభిమానులకు మాత్రమే కాకుండా సినిమా ప్రేమికులకు ఎంతో ఇష్టమైన సినిమాలు ఈ రెండు. ఈ రెండు సినిమాలను ఫ్యాన్స్ అని సంబంధం లేకుండా చాలామంది వెళ్లి థియేటర్ దగ్గర ఎంజాయ్ చేశారు.

ఇక తర్వాత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు సినిమాను మొదట రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత జల్సా సినిమా కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు రెండు కోట్ల కలెక్షన్స్ కూడా వసూలు చేసింది. మహేష్ బాబు తో మొదలైన ఈ రీ రిలీజ్ సందడి పవన్ కళ్యాణ్ సినిమాతో పీక్ కి వెళ్ళిపోయింది. అయితే ఆ తర్వాత ప్రభాస్ వర్షం, ఎన్టీఆర్ నటించిన సింహాద్రి, అల్లు అర్జున్ దేశముదురు, రవితేజ మిరపకాయ్ వంటి సినిమాలు కూడా రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమాలకు అంతగా ఆదరణ లభించలేదు.

INDRA

- Advertisement -

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు సినిమాలతో పాటు సెవెన్ జి బృందావన్ కాలనీ సినిమా కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. ఇకపోతే మెగా ఫ్యాన్స్ తో పాటు చాలామంది ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఇంద్ర రీ రిలీజ్. లాస్ట్ ఇయర్ కూడా ఇంద్ర సినిమాని రీ రిలీజ్ చేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడు ఘరానా మొగుడు సినిమాతో సరిపెట్టేసారు.

ఇక రీసెంట్ గా ఇంద్ర సినిమాను నిర్మించిన వైజయంతి సంస్థ 50 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంద్ర సినిమాను రిమాస్టర్ చేసి రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ట్విట్టర్ వేదిక వైజయంతి బ్యానర్ సంస్థ ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ చూసిన వెంటనే చాలామంది మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు