Indra – Narasimha Naidu: మళ్లీ మొదలైన సీనియర్ హీరోల ఫ్యాన్ వార్స్

Indra – Narasimha Naidu: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ అంటే ఏ సినిమా ఎన్ని సెంటర్స్ లో ఎన్ని రోజులు ఆడింది అంటూ జరిగేవి. ఇకపోతే రీసెంట్ గా ఫ్యాన్ వార్స్ అన్నీ కూడా కలెక్షన్స్ అంటూ మాట్లాడటం మొదలుపెట్టాయి. చాలా కలెక్షన్స్ ఫేక్ కలెక్షన్స్ వేస్తూనే ఉంటారు. ఈ రోజుల్లో ఒక సినిమా హిట్ అనేది కలెక్షన్స్ ని బట్టి డిసైడ్ చేయడం మొదలుపెట్టారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో వచ్చిన ఇంద్ర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. నిన్నటితో ఆ సినిమా 22 ఏళ్లు పూర్తి చేసుకుంది.

అయితే మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అందరూ అన్నయ్య అని చాలా ముద్దుగా మెగాస్టార్ ని పిలుచుకుంటారు. మెగాస్టార్ కెరియర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఇంద్ర సినిమాకు ఉన్న లెవెల్ వేరే రేంజ్ లో ఉంటుంది. సినిమా ఆది నుంచి ఆద్యంతం వరకు ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ సినిమాలో ప్రతి సీను ప్రతి డైలాగ్ ప్రతి పాట అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమాకి సంబంధించి అందరూ పర్ఫెక్ట్ గా డ్యూటీ చేశారు. అప్పటికే ఈ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా గొప్పతనాన్ని నిన్న ట్విట్టర్ వేదిక ఫ్యాన్స్ అందరూ చెప్పడం మొదలుపెట్టారు. అలానే కొంతమంది సినిమా గురించి పోస్ట్స్ కూడా పెట్టారు.

Indra

- Advertisement -

ఇంతలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ వచ్చి నరసింహనాయుడు సినిమా టాపిక్ ని తీసుకొచ్చారు. అసలు ఇంద్ర సినిమా కావాలి అని అడిగిందే నరసింహనాయుడు సినిమా చూసి అని చాలామంది మాట్లాడారు. కొంతమంది అయితే దాదాపు ఎన్నో ఏళ్లు కష్టపడి పెట్టిన రికార్డ్ని ఒక 19 ఏళ్ల కుర్రోడు వచ్చి బ్రేక్ చేశాడు అంటూ ఎన్టీఆర్ ని హైలెట్ చేయడం మొదలుపెట్టారు. ఏదేమైనా గాని ఇంద్ర సినిమా తర్వాత ఆ రేంజ్ ఫ్యాక్షన్ సినిమా ఇప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే రాలేదు అని చెప్పాలి. ఆ రేంజ్ లో ఒక ఫ్యాక్షన్ సినిమాను చేసి ఆ తర్వాత చెక్ పెట్టేసాడు మెగాస్టార్. ఇకపోతే ఈ సినిమాను మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న రీ రిలీజ్ చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు