Indra Re- Release: ఇంద్ర రీ రిలీజ్ వరకు ఈగలు తొలుకోవాల్సిందే

Indra Re- Release: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకు మంచి డేట్స్ దొరుకుతూ ఉంటాయి కానీ సినిమా ఫలితం వలన అవి వృధాగా పోతాయి. ఇంకొన్ని సందర్భాలలో మంచి సినిమా వచ్చినా కూడా అప్పుడున్న పరిస్థితులు ఆ సినిమాకి అనుకూలంగా ఉండవు. ఇక ఆగస్టు 15 సందర్భంగా బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అయితే వీటిలో ఆయ్ సినిమా మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ కూడా నెగెటివ్ టాక్ ను సాధించుకున్నాయి.

హరీష్ శంకర్(Harish Shankar) రవితేజ(Ravi Teja) మూడవసారి కలిసి చేసిన సినిమా మిస్టర్ బచ్చన్. మొదటినుంచి ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ఈ సినిమా మ్యూజిక్ కూడా అద్భుతంగా వర్క్ అవుట్ అయింది. పాటలన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. టీజర్ ట్రైలర్ కూడా సినిమా మీద మంచి హోప్ ఇచ్చింది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి మొదట పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత విపరీతమైన నెగటివ్ టాక్ ఈ సినిమాకు వచ్చింది. మొత్తానికి ఈ సినిమా అంతగా ఏం లేదు అంటూ ప్రేక్షకులు తేల్చేశారు.

రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్(Puri Jagannadh) దర్శకత్వంలో చేసిన సినిమా డబుల్ ఇస్మార్ట్(Double Ismart) శంకర్. వీరి కాంబినేషన్ లో ఇదివరకే ఇస్మార్ట్ శంకర్ అన్న సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఇస్మార్ట్ సినిమా మొదటి షో నుంచి నెగిటివ్ టాక్స్ సాధించుకుంది. లైజర్ సినిమా నష్టాల నుంచి ఈ సినిమా పూరి జగన్నాథ్ ను బయటకు తెస్తుంది అనుకుంటే ఇంకొంత లోపలికి తోసేసింది.

- Advertisement -

Mr Bachchan

రంజిత్ దర్శకత్వంలో విక్రమ్(Vikram) నటించిన తంగలను సినిమా కూడా ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ ను సాధించలేకపోయింది. ఎన్టీఆర్ బావమరిది నర్ణే నితిన్ నటించిన ఆయ్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా మినహాయిస్తే మిగతా మూడు సినిమాలు డిజాస్టర్ గా మిగిలిపోయాయి. వీటిని ఉద్దేశిస్తూ కొందరు ట్విట్టర్ వేదికగా ఇంద్ర సినిమా రీ రిలీజ్ వరకు ఈగలు తోలుకోవడమే పని అంటూ పోస్టులు పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు