Alekhya Tarakaratna : అలేఖ్య నందమూరి ఫ్యామిలికి ఇంకా దూరంగానే ఉందా?

Alekhya Tarakaratna : నందమూరి ఫ్యామిలిలో గత ఏడాది జరిగిన విషాదం తారకరత్న మరణం. ఎన్నికల ప్రచారంలో లోకేష్ యువగళం తరపున నందమూరి తారకరత్న కూడా ప్రచారం చేసాడని తెలిసిందే. ఆ పాదయాత్రలో ఒక్కసారిగా కుప్పకూలిన తారకరత్నను వెంటనే బెంగళూరులోని హాస్పిటల్‌లో చేర్పించి అన్నిరకాలుగా మెరుగైన వైద్యాన్ని అందించారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వలేకపోగా,పోరాడుతూనే తారకరత్న కన్నుమూశాడు. ఇదిలా ఉండగా తారకరత్న ది ప్రేమ వివాహం అని తెలిసిందే. ఫ్యామిలీకి ఇష్టం లేకుండా అలేఖ్య, తారకరత్నల ప్రేమ వివాహాం జరిగింది. ఇక చాలా ఏళ్లుగా నందమూరి ఫ్యామిలీకి తారకరత్న ఫ్యామిలీ దూరంగానే ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు దగ్గరకావడానికే ప్రయత్నించినా తండ్రి మోహన కృష్ణ పట్టించుకోలేదు. దీనికి తోడు తారకరత్న ఆర్థిక కష్టాలు కూడా ఎక్కువయ్యాయి. సినిమా ఆఫర్లు కూడా పెద్దగా లేకపోవడంతో చాలా కష్టాలపాలయ్యారు.

Interesting comments by Alekhya Tarakaratna on Nandamuri family

దూరం పెట్టిన తారకరత్న తండ్రి..

అయితే తారకరత్న మరణం తర్వాత కూడా నందమూరి ఫ్యామిలీ అలేఖ్యను, తన పిల్లలను దూరంగా ఉంచడం గమనార్హం. తారకరత్న తండ్రి మోహన కృష్ణ అయితే తారకరత్న అంతిమ యాత్ర టైంలో కూడా అతని భార్య అలేఖ్య, పిల్లల్ని దగ్గరకు తీసుకోలేదు. కానీ తారకరత్న చనిపోయాక అయినా అతని ఫ్యామిలీని తండ్రి చేరదీస్తారని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తండ్రి మోహనకృష్ణ ఇప్పటివరకు వాళ్ళని పట్టించుకోలేదని సమాచారం. ఇక తారకరత్న భార్య అలేఖ్య ఇప్పటికీ విడిగానే ఉంటుందని, ఫ్యామిలీతో ఏ కార్యక్రమాల్లో కలవట్లేదని తెలుస్తుంది. ఇదిలా ఉండగా అలేఖ్య రీసెంట్ గా సోషల్ మీడియాలో ఫాలోవర్ల తో చిట్ చాట్ చేయగా, దాంట్లో భాగంగా ఓ వ్యక్తి నందమూరి ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందన్న నమ్మకం ఉందా అని అడగగా, దానికి అలేఖ్య (Alekhya Tarakaratna) సమాధానం ఊహించని విధంగా వచ్చింది.

- Advertisement -

ఆ నమ్మకంతోనే ఆశగా ఉన్నాం – అలేఖ్య

రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా తారకరత్న బతికి ఉన్నప్పటినుండి కుటుంబంతో కలవడానికి ఎంతో ప్రయత్నించామని, ఇప్పుడు కూడా అదే ఆశతో ఉన్నామని, తమ ఆశ, నమ్మకాలే మనల్ని ముందుకు నడిపిస్తున్నాయని, ఆ నమ్మకంతోనే ఇన్నేళ్లు ముందుకు సాగుతూ వచ్చామని అలేఖ్య చెప్పుకొచ్చింది. ఇక అలాగే తమ కుటుంబం ఆ నమ్మకాన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదని..ఇక తాను కూడా వదిలిపెట్టనని.. ఖచ్చితంగా తాము కలిసిపోతామని.. ఆ నాకు నమ్మకం తనకు ఉందని అలేఖ్య చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి అలేఖ్య నందమూరి ఫ్యామిలీకి ఇంకా దూరంగానే ఉంటుందని, తన పిల్లలతో ఫ్యామిలీని ఎంతో మిస్ అవుతుందని తెలుస్తుంది. అయితే బాలకృష్ణ అప్పుడప్పుడూ తమని పలకరిస్తుంటారని, ఆయన తమ కుటుంబానికి అండగా ఉన్నారని అలేఖ్య పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు