GameChanger : శంకర్ పై రచయిత సాయిమాధవ్ బుర్రా ఆసక్తికర వ్యాఖ్యలు..

GameChanger : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “గేమ్ చేంజర్” సినిమాపై రామ్ చరణ్ అభిమానులు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. RRR తర్వాత చేస్తున్న సినిమా కావడంతో చరణ్ అభిమానులు ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. తమ హీరో పాన్ ఇండియా వైడ్ గా రికార్డులు సృష్టిస్తాడని అంటున్నారు. అయితే మూడేళ్ళుగా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ గురించి ఇప్పటి వరకూ డేట్ ప్రకటించలేదు. దానికిఒ కారణం ఇండియన్2 అని తెలిసిందే. అయితే ఆ సినిమా రిలీజ్ అవడం ప్లాప్ అవడం కూడా అయిపొయింది. దాని ప్రభావం కూడా ఇప్పుడు గేమ్ ఛేంజర్ పై పడుతుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు శంకర్ గేమ్ ఛేంజర్ పైనే పూర్తి శ్రద్ధ పెడుతున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా రచయిత సాయి మాధవ్ బుర్రా డైరెక్టర్ శంకర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Interesting comments by Sai Madhav Burra on GameChanger

గేమ్ ఛేంజర్ గురించి సాయి మాధవ్ బుర్రా..

ఇక గేమ్ ఛేంజర్ (GameChanger) సినిమా తెలుగు వెర్షన్ కి డైలాగ్స్ ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా రాయడం జరిగింది. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో గేమ్ చేంజర్ పై, అలాగే డైరెక్టర్ శంకర్ షణ్ముగం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. గేమ్ ఛేంజర్ గురించి ప్రస్తావిస్తూ.. గేమ్ ఛేంజర్ ఒక ఫుల్ పవర్ ప్యాకడ్ మూవీగా తెరకెక్కుతోందని, పక్కా శంకర్ మార్క్ సినిమాని ఆడియన్స్ ఎక్స్పీరెన్స్ చేస్తారని చెప్పుకొచ్చాడు. అలాగే శంకర్ గారు తనతో ఎల్లప్పుడూ కాంటాక్ట్ లో ఉన్నారని, గేమ్ ఛేంజర్ కి సంబంధించి తెలుగు డైలాగ్స్ పై ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, ఈ సినిమాతో సరికొత్త శంకర్ ని చూస్తారని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

డిసెంబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్!

ఇక గేమ్ ఛేంజర్ సినిమాను డిసెంబర్ 20 న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తాజాగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఇకపోతే గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోగా, రామ్ చరణ్ లేని ఓ పది రోజుల షూటింగ్ మాత్రమే బాకీ ఉంది. ఇక రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మరుక్షణమే సినిమా ప్రమోషన్లపై దృష్టి పెడతారని సమాచారం. ఇక గేమ్ ఛేంజర్ సినిమాలో హీరోయిన్లుగా కియారా అద్వానీ, అంజలి నటించగా, శ్రీకాంత్, ఎస్. జె సూర్య, జయరాం, సునీల్, సముద్రఖని, నవీన్ చంద్ర వంటి భారీ తారాగణం నటించారు. థమన్ మ్యూజిక్ అందించగా, త్వరలోనే రెండో సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు