Game Changer : గేమ్ ఛేంజర్ పై శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అది కూడా పూర్తయ్యాకే అనౌన్స్ చేస్తాడట!

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “గేమ్ చేంజర్” సినిమాపై రామ్ చరణ్ అభిమానులు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. RRR తర్వాత చేస్తున్న సినిమా కావడంతో చరణ్ అభిమానులు ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. తమ హీరో పాన్ ఇండియా వైడ్ గా రికార్డులు సృష్టిస్తాడని అంటున్నారు. అయితే మూడేళ్ళుగా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ గురించి ఇప్పటి వరకూ డేట్ ప్రకటించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. సంబంధించి ఇక రామ్ చరణ్ సినిమా షూటింగ్ ఆ మధ్య పూర్తయిందని ఒకరోజు మినహా షూటింగ్ పూరైందని వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎంత నిజముందో తెలీదు. శంకర్ మాత్రం ఇండియన్2 ప్రమోషన్ పనుల్లో పడిపోయాడు. అందువల్ల గేమ్ ఛేంజర్ పై చరణ్ ఫ్యాన్స్ లో అసహనం పెరిగిపోతుంది. ఇదిలా ఉండగా గేమ్ చేంజర్ గురించి తాజాగా ఇండియన్2 లో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు శంకర్.

Interesting comments by Shankar Shanmugam on Game Changer

అవన్నీ పూర్తయ్యాకే గేమ్ ఛేంజర్ పై అనౌన్స్ మెంట్…

తాజాగా ఇండియన్2 ప్రమోషన్లలో బిజిగా ఉన్నాడు శంకర్. కమల్ హాసన్ తో కలిసి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో శంకర్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. విలేఖరి తక్కువ గ్యాప్ లో రెండు పెద్ద సినిమాలు తీసుకురాబోతున్నారు, మరి గేమ్ చేంజర్ అప్డేట్ అని అడగగా… దానికి శంకర్ రిప్లై ఇస్తూ… గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది… 10 నుండి 15 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది. దాని రిలీజ్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇండియన్2 రిలీజ్ కాగానే ఆ సినిమా ఫినిష్ చేస్తాను. గేమ్ చేంజర్ ఫైనల్ ఫుటేజ్ చూసాక, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూరయ్యాక గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై అప్డేట్ చెప్తానని శంకర్ చెప్పుకొచ్చాడు. ఈ రిప్లై చూసి చరణ్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఒకవేళ పది రోజుల్లో గేమ్ ఛేంజర్ షూట్ పూర్తి చేయకాపోతే ఇక దీపావళికైనా తెస్తాడో లేదో అని చరణ్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఇక కొందరు అయితే శంకర్ చెప్పినట్టు గేమ్ ఛేంజర్ ఫైనల్ ఫుటేజీ చూసాక శంకర్ సంతృప్తి చెందకపోతే మళ్ళీ రీ షూట్లు ఏమైనా చేస్తాడేమో అని టెన్షన్ పడుతున్నారు. ఈ సమయంలో రీ షూట్ అంటే అసలు ఈ ఇయర్ రిలీజ్ అవుతుందో లేదో అని చరణ్ ఫ్యాన్స్ సందేహ పడుతున్నారు.

- Advertisement -

ఫలితం చరణ్ సినిమాపై చూపుతుందా?

ఇక గేమ్ ఛేంజర్ (Game Changer) షూటింగ్ విషయం పక్కన బెడితే కల్కి రిలీజ్ అయిన రెండు వారాలకు ఇండియన్ 2 రిలీజ్ అవుతుంది. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ఇండియన్ 2 ట్రైలర్ చూస్తుంటే ఓవరాల్ గా బాగానే ఉన్నా, కంటెంట్ విషయంలో జస్ట్ ఒకే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇండియన్2 రిలీజ్ అయ్యాక ఫలితం అటు ఇటు అయితే ఆ ఫలితం చరణ్ గేమ్ ఛేంజర్ ప్రభావం చూపే అవకాశం ఉందని నెటిజన్లు అంటున్నారు. పైగా ఇండియన్3 కూడా ఉందని శంకర్ చెప్తున్నాడు. ఈ లెక్కలేంటో అర్ధం కాకున్నా, చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఒక్క మంచి హిట్టు బొమ్మ ఇస్తే చాలని అంటున్నారు. మరి అంతా శంకర్ చేతుల్లోనే ఉంది. దీనిపై క్లారిటీ రావాలంటే ఇండియన్2 రిలీజ్ అయ్యే దాకా వెయిట్ చేయక తప్పట్లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు