Star hero ex-wife : విడాకులు తరువాత హ్యాపీ గా ఉన్న , స్టార్ హీరో మాజీ భార్య ఆసక్తికర వ్యాఖ్యలు

Star hero ex-wife : ఇండియాలో ఉన్న టాలెంటెడ్ నటుల్లో అమీర్ ఖాన్ ఒకరు. అమెరికన్ చేసినన్ని ఎక్స్పరిమెంటల్ ఫిలిమ్స్ ఇంకెవరూ చేయలేరు అని కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. ఎన్నో అద్భుతమైన సినిమాలను ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి అందించారు అమీర్ ఖాన్. చాలామందికి హిందీ సినిమా మీద గౌరవాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా అమెరికాకి ఉంది అని చెప్పొచ్చు. భాష అర్థం కాకపోయినా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ చేయడంలో అమీర్ ఖాన్ ఎప్పుడూ ముందుంటాడు అని అమీర్ ఖాన్ సినిమాలు చూడడానికి క్యూరియాసిటీతో ఎదురుచూసి ప్రేక్షకులు కూడా ఉన్నారు.

ఇది పోతే సినిమా లైఫ్ తో పాటు ప్రతి ఒక్కరికి తమ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అలానే అమీర్ ఖాన్ కిరణ్ రావు ను పెళ్లి చేసుకుని కొంత కాలం పాటు జీవించిన సంగతి తెలిసిందే. అయితే వారి మధ్య ఉన్న కొన్ని విభేదాలు కారణంగా వారిద్దరు విడిపోయి విడాకులు తీసుకున్నారు. ఇక రీసెంట్ గా సెలబ్రిటీలు విడాకుల గురించి ఎప్పుడు పడితే అప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూనే వస్తాయి. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ లపాతా లేడీస్ అనే ఒక సినిమాను తెరకెక్కించింది. ఈ సినిమా నెట్ ఫిక్స్ లో టాప్ వన్ లో ట్రెండ్ గా నిలిచింది. ఈ తరుణంలో పలు రకాల సినిమా ఈవెంట్స్ కి హాజరైన కిరణ్ రావ్ విడాకుల గురించి ప్రశ్నించగా ఈ విధంగా స్పందించింది.

Aamir Khan

- Advertisement -

అమీర్ నా జీవితంలోకి రాక ముందు నేను చాలా ఏళ్లు ఒంటరిగానే ఉన్నాను. ఆ ఒంటరితనాన్ని ఎంజాయ్ చేశాను. ఇప్పుడు నాకు ఆజాద్ (కుమారుడు) తోడుగా ఉన్నాడు. నేను ఒంటరి కాదు. ఇప్పటికీ ఇరు కుటుంబాలు నాకు అండగా ఉండటంతో ఎలాంటి భయం లేదు. చెప్పాలంటే ఇది సంతోషకరమైన విడాకులు. అంటూ సమాధానమిచ్చింది కిరణ్ రావు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు