Pushpa 2: పుష్ప 2 వాయిదాతో నిర్మాతలపై పడ్డ భారీ బడ్జెట్ భారం.. ఎన్ని కోట్లు అంటే..?

Pushpa 2: సుకుమార్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే.

ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు మేకర్స్. ఇక ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడడం వల్ల నిర్మాతలపై అదనపు భారం భారీగా పడినట్లు సమాచారం. పుష్ప 2 మూవీను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

interesting news about Allu Arjun Pushpa 2 movie
interesting news about Allu Arjun Pushpa 2 movie

ఈ చిత్రం రిలీజ్ సుమారు 4 నెలలు వాయిదా పడడంతో మేకర్స్ పై మరింత అదరపు భారం పడింది. వాయిదా వల్ల సుమారు 40 కోట్ల బడ్జెట్ ఈ చిత్రానికి అదనంగా ఖర్చు కానుందని ఈ మూవీ వర్గాలు చెప్పినట్టు ఓటిటి ప్లే రిపోర్ట్ వెల్లడించింది. ఈ చిత్రం సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇంకా సుమారు 50 రోజులు మిగిలి ఉన్నట్లు తెలుస్తుంది. కొన్ని సీన్స్ రీ షూట్ కూడా చేయనున్నారట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు