Sushant Singh: నేడు బాలీవుడ్ ను కుదిపేసిన రోజు.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వర్ధంతి..!

Sushant Singh: నేడు అనగా జూన్ 14న హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ వర్ధంతి. హిందీ లో ఓ సీరియల్ ద్వారా అరంగేట్రం చేసిన ఈయన అభిమానులలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే పలు అవార్డులు కూడా దక్కించుకుని ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నాడు.

కానీ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగ లేకపోయాడు. సుశాంత్ 34 ఏళ్ల వయసులోనే జూన్ 2020లో ముంబైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఇక దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కన్నీరు మున్నీరు అయ్యింది. యంగ్ హీరో మరణం అప్పట్లో సంచలనం సృష్టించింది.

interesting news about Bollywood hero Sushant Singh
interesting news about Bollywood hero Sushant Singh

తాను అంత చిన్న వయసులో చనిపోవడానికి కారణం తెలియక ప్రేక్షకులు కొద్ది రోజులు అయోమయంలో పడ్డారు. కానీ అనంతరం ఓ విషయం బయటికి రావడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సుశాంత్ ఓ హీరోయిన్ ని లవ్ చేయడం వల్లే చనిపోయినట్లు అప్పట్లో వార్తలు షికారు చేశాయి. కానీ ఇందులో ఎటువంటి నిజం లేదని అభిమానులు కొట్టివేశారు. మొత్తానికి సుశాంత్ సింగ్ మరణం ఇప్పటికీ ఎంతో మందిని కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు