Game Changer Shooting Update : ఏపీ గేమ్ ఛేంజర్ నుంచి శంకర్ గేమ్ ఛేంజర్ వైపు… ఇప్పుడు షూటింగ్ ఎక్కడంటే..?

Game Changer Shooting Update : మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చరణ్ ఎంతటి పాపులారిటీ సంపాదించుకున్నాడో మనందరికీ తెలిసిందే. తన ఓన్ టాలెంట్ తో ఎంతోమంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు చెర్రీ.

ఇక వరుస సినిమాలు చేస్తూ తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఇటీవలే జక్కన్న డైరెక్షన్లో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీతో మెగా పవర్ స్టార్ గా ఉన్న చరణ్ ట్యాగ్ ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా మారిపోయింది. ఇక ఈ బ్లాక్ బస్టర్ మూవీ అనంతరం రామ్ చరణ్ చేస్తున్న తదుపరిచిత్రం గేమ్ చేంజర్.

శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీ పై చరణ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటికి వచ్చింది. ప్రజెంట్ ఇదే వీడియో సోషల్ మీడియాలో షికారు చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు