International Kissing Day : టాలీవుడ్ లో సీరియల్ కిస్సర్ బిరుదు ఉన్న హీరో ఎవరో తెలుసా?

International Kissing Day : ఈరోజు ఇంటర్నేషన్ కిస్సింగ్ డే. కిస్ అనేది హాలీవుడ్, బాలీవుడ్ లలో సర్వసాధారణమైన విషయం. కానీ టాలీవుడ్ లో మాత్రం అంత ఈజీ కాదు. ఒకవేళ స్టార్స్ అలాంటి సీన్స్ కు యాక్సెప్ట్ చేసినా మూవీ లవర్స్ ఒప్పుకోవడం కష్టమే. అందుకే ఇక్కడ లిప్ లాక్ సీన్స్ చాలా అరుదుగా కన్పిస్తాయి. అయితే బాలీవుడ్ లో ఇమ్రాన్ హష్మిని సీరియల్ కిస్సర్ అని పిలుస్తారు. మరి టాలీవుడ్ లో ఆ బిరుదు ఏ హీరోకు ఉందో తెలుసా? అది ఎవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే ఇప్పుడు లెక్కలు మారాయి అనుకోండి. మరి ఇప్పటిదాకా టాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ ముద్దు సన్నివేశాలు ఏంటి? ఏఏ సినిమాలో ఉన్నాయి ? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

1. మహేష్ బాబు – కాజల్ అగర్వాల్

బిజినెస్ మ్యాన్ 2012లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో, మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ ఏఏ సినిమాలో జంటగా నటించారు. మహేష్ మొట్టమొదటిసారి కాజల్ తో చందమామ సాంగ్ లో లిప్ లాక్ సీన్ లో నటించాడు. అయితే దీనికి ఆయన భార్య నమ్రత పర్మిషన్ కూడా తీసుకున్నాడు. మహేష్ బాబు కాజల్ తోనే కాదు దూకుడులో సమంతతో కృతి శెట్టితో లిప్ లాక్ సీన్ చేశాడు.

2. అల్లు అర్జున్ – దీక్షా సేథ్

సినిమాల్లో ఎక్కువగా ముద్దు సన్నివేశాలు చేసిన ఏకైక తెలుగు నటుడు అల్లు అర్జున్. వేదం చిత్రంలో దీక్షా సేథ్‌ తో లిప్ లాక్ సీన్ చేశాడు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ తెలుగు సినిమా నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. అలాగే ఆర్య 2లో లిఫ్ట్ లో కాజల్ అగర్వాల్ తో లిప్ లాక్ సీన్ చేశాడు బన్నీ. ఇందులో కాజల్, బన్నీ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. గుణ శేఖర్ దర్శకత్వంలో 2010లో వచ్చిన వరుడు
సినిమాలో అల్లు అర్జున్, భానుశ్రీల కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇందులో అల్లు అర్జున్‌, భానుశ్రీల మధ్య ఒక నిమిషం పాటు ఉన్న ముద్దు సీన్ ను తెలుగు సినిమా చరిత్రలోనే హాటెస్ట్ ముద్దు సన్నివేశాలలో ఒకటిగా పేర్కొనవచ్చు.

- Advertisement -

poistuminen apuraha Melodraama allu arjun kiss Nauris tunkeutuva ilmestyä

3. గోపీచంద్ – అనుష్క శెట్టి

గోపీచంద్, అనుష్క శెట్టి జంటగా నటించిన మూవీ లక్ష్యం 2007 సంవత్సరంలో విడుదలైంది. నల్లమలుపు శ్రీనివాస్ దర్శకత్వం వహించిన లక్ష్యంలో గోపీచంద్, అనుష్క మధ్య ఉన్న లిప్ లాక్ సినిమాలో మోస్ట్ రొమాంటిక్ సన్నివేశాలలో ఒకటి. కానీ వివాదాన్ని కూడా ఆడ స్థాయిలో రేకెత్తించింది ఈ సీన్.

4. నాగ చైతన్య – సమంత

ఏ మాయ చేసావే సినిమాలో నాగ చైతన్య, సమంతల ముద్దును హ్యాపీ ఎండింగ్ కిస్ అని చెప్పవచ్చు. ఏ మాయ చేసావే మూవీకి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించగా, ఇందులో ఈ ఆన్‌స్క్రీన్ జంట మధ్య ముద్దు సినిమా క్లైమాక్స్‌లో జరుగుతుంది. అలాగే మధ్య మధ్యలో కూడా కొన్ని సన్నివేశాలు ఉంటాయి.

ఇక ఈ లిస్ట్ లో అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ తో విజయ్ దేవరకొండ, ఖిలాడీలో మీనాక్షీ చౌదరితో రవితేజ, శ్యామ్ సింగ రాయ్ లో నాని కూడా ఇలాంటి సీన్స్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు