Custody: ఉత్కంఠ భరిత యాక్షన్ ఎంటర్టైనర్ – చైతూకి హిట్ ఖాయమేనా..?

అక్కినేని నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు డైరెక్షన్లో రూపొందిన కస్టడీ సినిమా మే 12న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలెట్టిన సినిమా యూనిట్, సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని తాజాగా విడుదల చేసింది. యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. కథ, కథనంలో విభిన్నత్వానికి ప్రసిద్ధి చెందిన వెంకట్ ప్రభు ఈ సినిమాని కూడా విభిన్నంగా తీర్చి దిద్దినట్లు అనిపిస్తుంది. సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ చుట్టూ సాగే ఈ కథలో చాలా ఇంట్రస్టింగ్ పాయింట్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

అరవింద్ స్వామి, నాగచైతన్య మధ్య జరిగే డ్రామా ని ఫోకస్ చేస్తూ రూపొందిన ఈ ట్రైలర్ కట్ బాగుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగచైతన్య పోలీస్ కానిస్టేబుల్ పాత్రకు సరిగ్గా సెట్ అయ్యాడు. ప్రియమణి, సంపత్, అరవింద్ స్వామి ల క్యారెక్టర్లు కూడా ఈ సినిమాలో కీలకంగా ఉంటాయని అనిపిస్తుంది. అయితే యాక్షన్ బ్యాక్డ్రాప్ లో సాగే ఇలాంటి సినిమాలకు ట్రైలర్లోనే గూస్ బంప్స్ ఇచ్చే ఎలిమెంట్స్ ని ఎలివేట్ చేయాలి. కస్టడీ ట్రైలర్లో అది మిస్ అయ్యిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎలివేషన్స్ ఏమీ లేకుండా స్ట్రెయిట్ గా కథని ప్రాజెక్ట్ చేస్తూ ప్లేయిన్ గా సాగిన ఈ ట్రైలర్ పై ఇంకొంచెం దృష్టి పెట్టి ఉండాల్సిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నాగచైతన్య కెరీర్లో హిట్ కీలకమైన దశలో వస్తున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కృతి శెట్టి, నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా ఆశించిన స్థాయిలో అలరించకపోవటంతో కస్టడీ సినిమా అయినా హిట్ అవుతుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది. ఎన్నో అంచనాలతో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న కస్టడీ సినిమా హిట్ అయ్యి అక్కినేని వారి డిజాస్టర్స్ పరంపరకు బ్రేక్ వేస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు