IPL 2024 SRH : రేపు అనేది ఒకటి ఉంది కావ్య పాప… కావ్యను ఓదార్చిన బిగ్ బి

IPL 2024 SRH : మే 26న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఐపిఎల్ 2024 ఫైనల్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిణామంతో SRH జట్టు యజమాని కావ్య కన్నీళ్ళు పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అమితాబ్ ఆమెను ఓదారుస్తూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయ్యింది.

SRH ఓటమితో కన్నీటి పర్యంతమైన కావ్య

ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్లో KKR గెలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు KKR కు 113 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఇచ్చింది. కేకేఆర్ కేవలం 10 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని సాధించింది. SRH జట్టు ఓనర్ కావ్య మారన్ తమ జట్టు ఓడిపోతుందని తెలియగానే కన్నీరుమున్నీరైంది.

కావ్యకు అమితాబ్ ఓదార్పు

అమితాబ్‌ బచ్చన్‌కి క్రికెట్‌ అంటే ప్రత్యేక అభిమానం. ఆయన సమయం దొరికినప్పుడు ఇంట్లో క్రికెట్ చూస్తుంటాడు. ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా అమితాబ్ వీక్షించాడు. హైదరాబాద్ జట్టు దారుణంగా ఓడిపోవడంపై అమితాబ్ బాధపడ్డాడు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్‌లో రాశారు.

- Advertisement -

Kavya Maran Breaks Down, Turns Her Back to the Camera to Wipe Tears as SRH lose to KKR in IPL 2024 Final: WATCH - News18

‘ఐపీఎల్ ఫైనల్ ముగిసింది. KKR సులభంగా గెలిచింది. SRH మంచి జట్టు. ఇతర జట్లతో కలిసి చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ ఫైనల్‌లో SRH పర్ఫార్మెన్స్ నిరాశపరిచింది’ అని అమితాబ్ బచ్చన్ అన్నారు.

రేపు అనేది ఒకటి ఉంటుంది

కళ్ళముందే తన టీం ఓడిపోవడాన్ని చూసి కావ్య ఎమోషనల్ అయ్యింది. ఆ బాధను తట్టుకోలేక కన్నీటి పర్యవంతమైంది. అయితే టీంను నిరుత్సాహపరిచే ఉద్దేశం లేకపోవడంతో కన్నీళ్లను దిగమింగుకునే ప్రయత్నం చేసింది కావ్య. కానీ తన వల్ల కాకపోవడంతో వెనక్కి తిరిగి కెమెరా కంట పడకుండా కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక తాజాగా అమితాబ్ తన బ్లాగ్ లో ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ మరింత బాధ కలిగించిన విషయం ఏమిటంటే సన్ రైజర్స్ యజమానురాలు కావ్య స్టేడియంలోనే ఏడ్చేయడం. కెమెరాల కంట పడకూడదనే ఉద్దేశంతో ఆమె వెనక్కి తిరిగి తన బాధను కన్నీళ్ళ రూపంలో బయట పెట్టింది. ఆమెను అలా చూస్తే బాధ కలిగింది. ఇదే ముగింపు కాదు మై డియర్… రేపు అనేది ఒకటి ఉంటుంది అంటూ తన బ్లాగ్ ద్వారా అమితాబ్ కావ్యను ఓదార్చారు. ప్రస్తుతం ఆయన చేసిన ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

కావ్యపై ట్రోలింగ్

ఫైనల్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ భారీ స్కోర్ చేయాలని కోరుకుంటారు. SRH కూడా ఇదే అంచనాలతో రంగంలోకి దిగింది. అయితే కీలక ఆటగాళ్లు అందరరి ఆశలను నీరుగార్చారు. దీంతో SRH జట్టు 113 పరుగులకు ఆలౌట్ అయింది. 114 పరుగుల లక్ష్యాన్ని KKR కేవలం 10 ఓవర్లలో ఛేదించింది. ఇక KKR విన్ అయ్యాక ఆ జట్టు యజమాని అయిన షారూఖ్ తన కుటుంబంతో కలిసి పొంగిపోయిన ఫోటోలు, వీడియోలు ఇంకా ట్రెండ్ అవుతున్నాయి. KKR ఫ్యాన్స్ విన్ అయిన సంబరంలో కావ్యను ట్రోల్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు