Salaar : ప్రభాస్ పరువు తీసేస్తున్నారే… కార్పోరేట్ బుకింగ్స్ వివాదం మేకర్స్ కు కనిపించట్లేదా?

Salaar : “సలార్” మూవీకి కార్పొరేట్ బుకింగ్స్ చేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న వివాదం మేకర్స్ కు కనిపించట్లేదా? కొంతమంది నార్త్ వాళ్ళు కావాలని ఇలా చేసి ప్రభాస్ పరువు తీయాలని చూస్తున్నారా? ఇంతకీ ఈ కార్పొరేట్ బుకింగ్స్ వివాదం ఏంటి? అంటే..

కార్పొరేట్ బుకింగ్ అంటే స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు అనుకున్నంత హైప్ రాకపోవడం లేదా కనెక్షన్లు రాని సందర్భాల్లో ఆ మూవీలో నటించిన హీరో లేదంటే నిర్మాణ సంస్థ కొన్ని కార్పొరేట్ సంస్థల ఉద్యోగులకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసి మరీ సినిమా చూసే అవకాశాన్ని కల్పిస్తారు. దీంతో ఈ మూవీకి ఎక్కువ టికెట్స్ అమ్ముడు అవుతున్నాయి అంటూ అందరినీ నమ్మిస్తారు. ఇక ఇలా ఫ్రీ టికెట్ తో సినిమా చూసిన వాళ్లంతా సోషల్ మీడియా ఖాతాలో సినిమా గురించి పాజిటివ్ గా రాస్తూ ప్రమోట్ చేస్తారు. అంటే కార్పొరేట్ బుకింగ్స్ చేసి వాళ్ల సినిమాకు వాళ్లే హైప్ పెంచే ప్లాన్ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఫేక్ కలెక్షన్స్ సృష్టించే ఈ ప్లాన్ ను కార్పొరేట్ బుకింగ్స్ స్కాం అంటారు.

అయితే ప్రస్తుతం “సలార్” మూవీ విషయంలో ఇదే జరుగుతోంది అంటూ సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. డిసెంబర్ 26వ తేదీ రాత్రి “సలార్” కార్పొరేట్ బుకింగ్స్ గురించి సోషల్ మీడియాలో దుమారం రేగింది. బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ యాప్ లలో “సలార్” ఎర్లీ మార్నింగ్ షోలు ఫుల్ అయ్యి చూపించడం ఈ వివాదానికి దారి తీసింది. ఐనాక్స్ వంటి కొన్ని నేషనల్ ఫ్లెక్స్ చైన్లలో ఉదయం 6, 7 గంటల బుకింగ్స్ అన్ని ఫుల్ అయిపోయి కనిపించడంతో “సలార్” టీం కార్పొరేట్ బుకింగ్స్ చేస్తోంది అంటూ షారుక్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఈ స్పెషల్ షోల గురించి ఏ డిస్ట్రిబ్యూటర్ కు కూడా కనీస సమాచారం లేదు. మరి “సలార్”పై ఆడుతున్న ఈ బ్లేమ్ లో కీలక పాత్రధారి ఎవరు? అంటూ ఎర్లీ మార్నింగ్ షోలు వేసిన పలు మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

- Advertisement -

అసలు “సలార్” విషయంలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ప్రూఫ్ తో సహా బయట పెడుతున్నారు మన తెలుగు ప్రేక్షకులు. వైజాగ్, విజయవాడ వంటి ప్రాంతాల్లో నిన్నటిదాకా అసలు “సలార్” హిందీ షోలు లేనేలేవు. కానీ ఈరోజు సడన్గా ఈరోజు కొన్ని ఎర్లీ మార్నింగ్ షోలు ప్రత్యక్షం అయ్యాయి. కేవలం ఇక్కడ మాత్రమే కాదు ఇండియా మొత్తం లోకల్ డిస్ట్రిబ్యూటర్లకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ థియేటర్లు ఎర్లీ మార్నింగ్ షోస్ ఓపెన్ చేశాయి. దీని వెనక ఉన్నది ఎవరు అంటూ పివిఆర్ సినిమాస్ వారిని నిందిస్తున్నారు.

అంతేకాకుండా నెక్స్ట్ టైం నుంచి తెలుగు స్టేట్స్ లో ఎర్లీ మార్నింగ్ తెలుగు షోస్ పెట్టండి అప్పుడైతేనే దొరికిపోకుండా ఉంటారు అంటూ సెటైర్లు వేస్తూ నార్త్ పిఆర్ టీం హస్తమే దీని వెనకాల ఉంది అని మండిపడుతున్నారు. అంతేకాకుండా ఈ స్కామ్ ఓన్లీ బాలీవుడ్ మాఫియా హ్యాండిల్ చేసే ఐనాక్స్ థియేటర్లలో మాత్రమే జరుగుతోంది అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఏదైతేనేం ఈ కాంట్రవర్సీపై “సలార్” మేకర్స్ స్పందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు