Samantha: సమంతకు పెళ్లిందని అంతలా అవమానించారా?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తాను నటించిన మొదటి సినిమాతోనే విపరీతమైన గుర్తింపును తెచ్చుకుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇప్పటికీ సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా కొనసాగుతోంది.
తన నటన, అమాయకత్వం, అందం, ఎక్స్ప్రెషన్స్ తో ఎంతోమంది మనసులను ఆకట్టుకున్న ఈ చిన్నది కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. దాదాపు పది సంవత్సరాలకు పైనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తన హవాను కొనసాగిస్తోంది. స్టార్ అగ్ర హీరోలందరి సరసన నటించి ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ వివాహం చేసుకుంది.

ఇక వివాహ అనంతరం తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో సంతోషంగా గడిపినటువంటి సమంత అతి తక్కువ సమయంలోనే వివాహ బంధానికి స్వస్తి చెప్పింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఏవో కొన్ని అనివార్య కారణాలతో విడాకులు తీసుకొని ప్రస్తుతం వేరుగా ఉంటున్నారు. ఇక విడాకులు అనంతరం సమంత, అటు నాగ చైతన్య ఇద్దరు సినిమాల పరంగా బిజీగా ఉన్నారు. ఇక సమంత మాత్రం విడాకుల అనంతరం కాస్త అనారోగ్యానికి గురైంది. మయోసైటిస్ వ్యాధి భారిన పడింది. ఇక ఈ వ్యాధికి ట్రీట్మెంట్ కోసం తాను చాలా కాలం పాటు శ్రమించింది. కొద్ది రోజులపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి మరి ట్రీట్మెంట్ తీసుకుంది. ఇక ఇప్పుడిప్పుడే వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న సమంత మళ్ళీ సినిమాల్లో నటిస్తూ తన హవాను కొనసాగిస్తుంది.

ఇదిలా ఉండగా…. సమంత రంగస్థలం సినిమాతో మంచి సాలిడ్ హిట్ అందుకుంది. ఇక ఆ సినిమాలో సమంత తన క్యారెక్టర్ లో అద్భుతంగా నటించింది. అచ్చతెలుగు పల్లెటూరి అమ్మాయి పాత్రలో సమంత కనిపించి తన అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ముందుగా సమంతను కాకుండా వేరే హీరోయిన్ ని అనుకున్నారట డైరెక్టర్ సుకుమార్. ఇక ఈ విషయం చిరంజీవికి తెలిసి రంగస్థలం సినిమాలో ఆ పాత్రని సమంత మాత్రమే అద్భుతంగా చేయగలుగుతుందని చిరంజీవి జోక్యం చేసుకున్నారట. ఇక చిరంజీవి అలా చెప్పడంతో కాదనలేక సుకుమార్ సమంతను హీరోయిన్గా పెట్టి ఈ సినిమా తీశారట. ఈ సినిమాలో హీరోగా రామ్ చరణ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు