Ishwarya Menon : సాగరతీరంలో మతిపోగొడుతున్న ఐశ్వర్య..!

Iswarya Menon : టాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ హీరోయిన్ గా పరిచయమైన కొత్త భామల్లో ఐశ్వర్య మీనన్ కూడా ఒకరు. తమిళ్ హీరోయిన్ అయిన ఈ భామ అక్కడ చాలా సినిమాలు చేసినా అంతగా సక్సెస్ కాలేదు. ఇక లాస్ట్ ఇయర్ నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన “స్పై” సినిమా తో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య. కానీ అనూహ్యంగా ఈ సినిమా ప్లాప్ కావడం జరిగింది. ఈ సినిమా పై ఐశ్వర్య మీనన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ ఐశ్వర్య మీనన్ కి నటిగా మంచి పేరు తెచ్చింది. ముఖ్యంగా తన గ్లామర్ కి ఇక్కడ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కానీ ఇప్పటివరకు మళ్ళీ తెలుగులో ఐశ్వర్య సినిమా చేయలేదు. అలాగని తమిళ్ లో కూడా చేయలేదు. కానీ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయింది.

వరుస సినిమాలతో బిజీ..

ఇక ఐశ్వర్య మీనన్ లాస్ట్ ఇయర్ స్పై సినిమాతో పలకరించగా, ఆ సినిమాతో హిట్టు మాత్రం కొట్టలేకపోయింది. కానీ తన గ్లామర్ తో టాలీవుడ్ మేకర్స్ ని అయితే అట్రాక్ట్ చేసిందని చెప్పాలి. ఇక ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా తాజాగా టాలీవుడ్ కార్తికేయ సినిమాలో నటిస్తుంది. కార్తికేయ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “భజే వాయువేగం” పేరుతో తెరకెక్కుతుండగా, ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా స్పై రిలీజ్ కి ముందే ఫిక్స్ అయినా, షూటింగ్ మాత్రం ఈ మధ్యే మొదలు పెట్టారు. ఇక కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తుండగా, ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. మరి ఐశ్వర్య రెండో సినిమాతోనైనా తెలుగులో సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి. ఇక తమిళ సినిమా ‘కాదలిల్‌ సోదప్పువదు ఎప్పడి’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఐశ్వర్య మీనన్ తెలుగు లో లవ్‌ ఫెయిల్యూర్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెల్సిందే.

Ishwarya Menon Latest hot photoshoot on beach

- Advertisement -

సముద్రం దగ్గర మతిపోయే అందాలతో..

అయితే ఐశ్వర్య మీనన్ (Ishwarya Menon) సోషల్ మీడియా లో మాత్రం తెగ యాక్టీవ్ గా ఉంటుంది. పెద్దగా సినిమాలు సక్సెస్ లేకపోయినా, మూడున్నర మిలియన్ల ఫాలోవర్లు ఇంస్టాగ్రామ్ లో ఉన్నారు. దీనికి కారణం తన ఫోటోషూట్లే అని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోజులతో ఆకర్షిస్తుంది. సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా సోషల్‌ మీడియా ద్వారా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా నెట్టింట మళ్ళీసముద్రం దగ్గర ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా ఐశ్వర్య మీనన్ వార్తల్లో నిలిచింది. సాగరతీరాన ప్రకృతి అందాల మధ్య అందమైన ఐశ్వర్య మీనన్ అందంను చూస్తూ ఉంటూ నెటిజన్లకు చూపు తిప్పనివ్వడం లేదు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్వరలో తెలుగులో భజే వాయువేగం, లేదా మరో సినిమాతోనైనా నిఖార్సైన హిట్ కొట్టబోతుందని అనిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు