PS2 : శోభితా ధూళిపాళ్ల పై సీరియస్ అయిన ఐశ్వర్య

గతేడాది మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ పార్ట్1 (PS 1) తమిళ్ లో ఘన విజయాన్ని సాధించింది. తెలుగులో కూడా ఈ సినిమాని అదే పేరుతో రిలీజ్ చేసారు. మణిరత్నం సినిమాలకి తెలుగులో చాలా మంది అభిమానులు ఉన్న కూడా బాహుబలి లాంటి ఎపిక్ సినిమాని ఎక్స్ పీరియన్స్ చేసిన ఇక్కడి ఆడియన్స్ కి ఈ సినిమా అంతగా ఎక్కలేదు. ఫలితంగా PS1 తెలుగులో ఒక మోస్తరు విజయాన్ని దక్కించుకుంది.

PS సినిమా సిరిస్ ని మణిరత్నం,  కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు.  కథలో చిన్న, చిన్న మార్పులతో చాలా జాగ్రత్తగా ఈ సినిమాని మలిచారు మణిరత్నం . కానీ ఈ సినిమా తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకోలేక పోయింది. జయం రవి, కార్తీ, విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత, ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు.ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఇటీవలనే రిలీజై థియేటర్స్ లో ప్రదర్శించబడుతుంది.

అయితే ఈ సినిమాలో నటించిన శోభిత దూళిపాళ్ల , ఐశ్వర్య లక్ష్మి లు షూటింగ్ సమయంలో తీసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. PS2 సినిమా షూటింగ్ చివరి రోజు ఇద్దరు క్యారివాన్ లో మేకప్ చేసుకున్న తర్వాత కొన్ని ఫోటోలు దిగి స్క్రిప్ట్ లోని డైలాగ్స్ తో సరదాగా ఫొటోలకి ఫోజులు ఇచ్చారు. అయితే ఈ వీడియోని శోభిత ఆమె ఇంస్టాగ్రామ్ లో షూటింగ్ రోజులని తను మిస్ అవుతున్న, పొన్నియన్ సెల్వన్ తనకి మంచి రోజులని అందించింది అంటూ పోస్ట్ చేసింది. అయితే ఐశ్వర్య లక్ష్మి పర్సనల్ గా తీసుకున్న వీడియోని ఎందుకు పబ్లిక్ లో పోస్ట్ చేసావ్ అంటూ కామెంట్ చేసింది. వీళ్లిద్దరి గొడవ చుసిన నెటిజన్లు కూల్ ఐశ్వర్య అంటూ రిప్లై ఇస్తున్నారు. ఇద్దరికీ సిక్స్ ప్యాక్ ఉన్నాయేంటి అంటూ చిత్ర విత్రమైన కామెంట్స్ చేస్తూ ఫన్ జెనరేట్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు