Prabhas : ఇంతలా మోసం చేయ్యాలా డార్లింగ్…

Prabhas Marriage : టాలీవుడ్‌లో కాదు కాదు… సౌత్ ఇండస్ట్రీ… ఇంకాస్త ముందుకు వెళ్దాం… భారతీయ సినీ పరిశ్రమలో ఒక్క సారి గమనిస్తే
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు…?
అమ్మాయిలకు ఫేవరెట్ హీరో ఎవరు…?
ఎవరు పెళ్లికి రెడీ అంటే స్వయంవరానికి వచ్చే అమ్మాయిల సంఖ్య వేలల్లో.. లక్షల్లో ఉంటుంది…?

ఇంకా ఇలాంటి ప్రశ్నలు ఎన్ని రెడీ చేసుకుని మాట్లాడినా, అందరి నుంచి వచ్చే ఆన్సర్… ది పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ అనే వస్తుంది. ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణం రాజ్ చివరి కోరిక, డార్లింగ్ ఎంతో ప్రేమించే వారిలో ముందు ఉండే పెద్దమ్మ శ్యామలా దేవీ ఎప్పుడూ చెప్పేది ఈయన పెళ్లి గురించే.

ఈ 44 ఏళ్ల ఆరడుగుల పాన్ ఇండియా స్టార్ పెళ్లి ప్రస్తావన ఏడాదిలో ప్రతీ నెలలో ఒక్కసారి అయినా ప్రస్తావనకు వస్తుంది. ఈ రోజు కూడా అదే ప్రస్తావన వచ్చింది. ఇప్పటి వరకు ఈ టాపిక్ రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ, ఈ రోజు ఈయన పెళ్లి టాపిక్ సోషల్ మీడియాలో చర్చకు రావడానికి కారణం మాత్రం ప్రభాసే.

- Advertisement -

మార్నింగ్ టైంలో ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “Darlings!!.. Finally Someone Very Special is About Enter our Life… Wait Cheyandi… “ అంటూ రాసుకొచ్చాడు. అసలే ప్రభాస్ పెళ్లి కోసం ఎదురుచూస్తున్న ఆయన ఫ్యాన్స్ ఈ వర్డ్స్ చూసిన తర్వాత డార్లింగ్ పెళ్లి కొడుకు అయ్యే రోజు వచ్చింది అంటూ సెలబ్రెట్ చేసుకున్నారు. ప్రభాస్ లైఫ్‌లోకి వచ్చే అమ్మాయి ఎవరై ఉంటారు అంటూ తెగ ఆలోచించారు. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ పోస్ట్ లను కంపేర్ చేస్తూ ప్రభాస్ లవ్ ఈమె అంటూ ఫిక్స్ అయ్యారు.

Prabhas Instagram Story
ప్రభాస్ ఇన్‌స్టగ్రామ్ స్టోరీ

ఇలా ఫిక్స్ అవ్వడానికి కారణం.. ప్రభాసే. ఎందుకంటే ప్రభాస్ ఎప్పుడూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయ్యడు. సినిమా ప్రమోషన్స్ కోసం సిల్లీగా పోస్టులు చేయడు. అందుకే ప్రభాస్ స్టోరీని అందరూ సీరియస్‌గా తీసుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే, తమ అభిమాన హీరో ఫైనల్‌గా ఓ ఇంటి వాడు అవుతున్నాడని అనుకున్నారు.

కానీ, ఇప్పుడు అసలు వార్త వైరల్ అవుతుంది. ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి, ఆయన పర్సనల్ లైఫ్‌కి ఎలాంటి సంబంధం లేదట. ఇది రాబోయే ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ స్టోరీ పోస్ట్ చేశాడని తెలుస్తుంది. Filmify కి వచ్చిన సమాచారం కూడా దాదాపు ఇదే. ప్రభాస్ పెళ్లి ముచ్చట ఇప్పట్లో లేదట. ఈ రోజు వచ్చిన స్పెషల్ పర్సన్ రాబోయే మూవీకి సంబంధించనదే అని తెలుస్తుంది.

ఇప్పుడు ఈ విషయం మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్…
ఏప్రిల్ అయిపోయి.. “చాలా కాలం అవుతుంది డార్లింగ్.. ఇప్పుడు ఎందుకు ఫూల్స్ చేస్తున్నావు.
సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా మోసం చేస్తావా డార్లింగ్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ చేప్పాలనుకున్నాది ఏంటి అనే సస్పెన్స్ మాత్రం ఇంకా వీడలేదు. “ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఏ సినిమా గురించి అయి ఉంటుంది..? సినిమా గురించి కాకపోతే పర్సనల్ లైఫ్ గురించా…? పర్సనల్ లైఫ్ గురించే అయితే, ప్రభాస్ పెళ్లి లేదా లవ్ గురించి అనౌన్స్ చేసే పద్దతి అయితే ఇది కాదు. మరి ఏంటి… ఈ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ వెనక ఉన్న అసలు కథ” ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ట్రెండింగ్ పాయింట్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు