Jailer: నెల్సన్‌కి ఇది హ్యాట్రిక్

సూపర్ స్టార్ రజనీకాంత్ 169 చిత్రానికి జైలర్ అని టైటిల్ ఫిక్స్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్‌ను సన్ పిక్చర్స్ అధికారిక సోషల్ మీడియా పేజీల ద్వారా విడుదల చేసింది. అన్నత్తే తర్వాత రజనీకాంత్ నటిస్తున్న తదుపరి చిత్రం జైలర్.ఈ చిత్రంతో మొదటిసారిగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌తో కలిసి పని చేయనున్నారు రజినీకాంత్.

నెల్సన్ చివరగా విజయ్ తో చేసిన “బీస్ట్” సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. ఆ సినిమా విజయ్ అభిమానులకు, నెల్సన్ కి కూడా అసంతృప్తిని మిగిల్చిందనేది కొంతమంది అభిప్రాయం. ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ జైలర్‌ సినిమాతో తిరిగి బౌన్స్ అవ్వాలని ఎదురు చూస్తున్నాడు.

నెల్సన్ మొదటి సినిమా మినహాయిస్తే వరుసగా మూడోసారి తన సినిమా టైటిల్ కోసం ఒక ఆంగ్ల పదాన్ని ఎంచుకున్నాడు మొదటిది శివకార్తికేయన్ నటించిన డాక్టర్, తరువాత తలపతి విజయ్‌తో బీస్ట్,
ఇప్పుడు రజినీ తో చెయ్యబోయే సినిమాకి జైలర్.

- Advertisement -

జైలర్ యాక్షన్ ప్యాక్డ్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా స్టైలిష్ అప్పీల్‌తో ఉంటుందని భావిస్తున్నారు. రోబో, పెట్టా, అన్నత్తే చిత్రాల తర్వాత రజనీకాంత్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న నాలుగవ సినిమా ఇది.
జైలర్ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు