Jabardast: జబర్దస్త్ ఆర్టిస్ట్ మృతి..!

Jabardast.. తెలుగు బుల్లితెర పై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే కామెడీ షోలలో జబర్దస్త్ కూడా ఒకటి.. దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఈ షో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతోంది. ఈ షో వల్ల ఎంతోమంది హీరోలు, యాంకర్స్, కమెడియన్స్ గా ఇండస్ట్రికి పరిచయమయ్యారు. ఇందులో ఆర్టిస్టుగా నటిస్తున్నటువంటి ఒక నటుడు తాజాగా మరణించినట్టుగా తెలుస్తోంది.అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

కదిలే రైలు ఎక్కడం వల్లే ప్రమాదం..

Jabardast: Jabardast artist died..!
Jabardast: Jabardast artist died..!

అసలు విషయంలోకి వెళ్తే.. జబర్దస్త్ కమెడియన్ గా పేరుపొందిన మహ్మద్దీన్ ఎన్నో కామెడీ స్కిట్లలో కనిపించారు.. దాదాపుగా 50 స్కిట్లలో నటించినట్లు తెలుస్తోంది. నిన్నటి రోజున కాకతీయ ఎక్స్ప్రెస్ ట్రైన్ ను ఎక్కేందుకు ప్రయత్నించగా.. ఆయన కాలుజారి కిందికి పడడం జరిగిందట.. అయితే ఆ ట్రైన్ ముందుకు కదులుతున్నప్పుడు ఎక్కడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ట్రైన్ ప్లాట్ఫారం మధ్యలో ఇరుక్కుపోయి మహ్మద్దీన్ మరణించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం గమనించిన అక్కడ తోటి ప్రయాణికుల సైతం చైన్ లాగడంతో రైలును ఆపినట్లుగా తెలుస్తోంది..వెంటనే అక్కడికి సిబ్బంది చేరుకొని రైల్వే పోలీసులకు సైతం సమాచారం అందించగా ఈ కమెడియన్ ను అతి కష్టం మీద వారు బయటకు తీసినట్లుగా సమాచారం.

పక్కటెముకలు విరిగి అక్కడికక్కడే మృతి..

వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు అక్కడ తెలిపిన ప్రకారం.. మహ్మద్దీన్ నడుము భాగంలో పక్కటెముకలు చాలా దెబ్బతిన్నాయని.. మెరుగైన వైద్యం కోసం ఇతర ఆసుపత్రికి వెళ్లాలని సూచించారట.. వెంటనే తీసుకు వెళుతూ ఉండగా మార్గమధ్యంలో మహ్మద్దీన్ తుది శ్వాస విడిచినట్లుగా సమాచారం. మహ్మద్దీన్ టీవీ ఆర్టిస్టుగా కూడా రాణించారు. సినిమా షూటింగ్ ఉండడంతో ట్రైన్ ఎక్కేందుకు వెళ్లిన ఈయన రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు.. సమయం ఆలస్యం అవుతుందన్న నేపథ్యంలో.. రన్నింగ్ ట్రైన్ ఎక్కడంతో ఇలాంటి సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

శోకసంద్రంలో కుటుంబం..

ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు . ఈ కమెడియన్ కి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఇందులో ఒక కుమార్తె డిగ్రీ చదువుతూ ఉండగా మరొక కుమార్తె పదవ తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది. మహ్మద్దీన్ మరణ వార్త విని అటు జబర్దస్త్ కమెడియన్స్ తన తోటి స్నేహితులు సైతం తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఏది ఏమైనా జబర్దస్త్ కమెడియన్ ఇలా ఉన్నట్టుండి మరణించడం బాధాకరమని చెప్పవచ్చు.

మహ్మద్దీన్ కెరియర్..

మహ్మద్దీన్ కెరియర్ విషయానికి వస్తే…జబర్దస్త్ లో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు.. అంతేకాదు ఆయన యాస భాష అన్నీ కూడా చాలా విచిత్రంగా ఉండేవి మాట్లాడితేనే నవ్వే అంతలా ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకునేవారు.. అలా దాదాపు 50 ఎపిసోడ్ ల వరకు చేసిన ఈయన కొన్ని కారణాలవల్ల జబర్దస్త్ కి దూరమై ఇతర షోలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే షూటింగ్ కి లేట్ అవుతుందన్న కారణంగా హుటాహుటిన వెళ్లే రైలు ఎక్కడంతో కాలుజారి రైలు కింద పడినట్లు తెలుస్తోంది. ఇక ఆయన మరణ వార్త విని బుల్లితెర ఇండస్ట్రీ సోకసంద్రంలో మునిగిపోయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు