Jabardasth Faima : కాబోయే భర్త పేరు బయటపెట్టిన ఫైమా… ప్రియుడితో పెళ్లికి రెడీ

Jabardasth Faima : పాపులర్ బుల్లితెర షో జబర్దస్త్ ద్వారా లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపును దక్కించుకున్న ఫైమా ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది. తనకు కాబోయే భర్త పేరును కూడా వెల్లడించింది. మరి ఈ అమ్మడిని పెళ్లాడబోయే వరుడు ఎవరు? అనే వివరాల్లోకి వెళితే…

పెళ్ళికి రెడీ అయిన ఫైమా

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా కమెడియన్లుగా మంచి ఫేమ్ తెచ్చుకున్న నటీనటుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అందులో చాలామంది ప్రస్తుతం సినిమాల్లో కూడా నటిస్తున్నారు. వేణు, ధనరాజ్ లాంటి కమెడియన్లు డైరెక్టర్లుగా మారి సత్తా చాటుతుంటే, రైటర్ గా హైపర్ ఆది, హీరో గా సుడిగాలి సుధీర్ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక అదే షో ద్వారా కొంతమంది లేడి కంటెస్టెంట్లు కూడా ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీని దక్కించుకున్నారు. అలాంటి లేడీ కంటెస్టెంట్స్ లో ఫైమా కూడా ఒకరు. జబర్దస్త్ లో అడుగు పెట్టి తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇక్కడ విపరీతమైన క్రేజ్ పెరగడంతో అదే ఆమె తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టడానికి దారి తీసింది. హౌస్ లో కూడా టాస్కులు బాగా ఆడుతూ, అందరితోనూ కలిసిపోతూ మంచి పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్ లో ఆమె అందించిన ఎంటర్టైన్మెంట్ కు నాగ్ కూడా ఫిదా అయ్యారు.

ఇక ఆ తర్వాత పలు టీవీ షోలలో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్ లతో ముచుట్టించిన ఫైమా పెళ్లిపై రియాక్ట్ అయింది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అక్క? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తొందరలోనే చేసుకుంటానని సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా తనకు కాబోయే వరుడు ఇంటి పేరు బాదావత్ అని హింట్ కూడా ఇచ్చింది. ఒకవేళ తన పెళ్లి గురించి ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే బ్లాగ్ లో అడిగితే సమాధానం చెప్తానని చెప్పుకొచ్చింది. దీంతో ఫైమా పెళ్లాడబోయే ఆ వ్యక్తి ఎవరు అని ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజెన్లు.

- Advertisement -

Jabardasth Faima: 'అందుకే మేం దూరమయ్యాం'.. ప్రవీణ్‌తో వీణ్‌తో బ్రేకప్‌కు  అసలు కారణం చెప్పేసిన ఫైమా - Telugu News | Jabardasth Faima opens up about  relationship with Praveen Telugu Cinema ...

కమెడియన్ తో ప్రేమ రూమర్లు

ఫైమా పెళ్లి గురించి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పటాస్ ప్రవీణ్ తో ఈ బ్యూటీ ప్రేమలో ఉందని పుకార్లు షికార్లు చేశాయి. ఇద్దరూ కలిసి పలు షోలు చేయడం, అవి హిట్ అవడం, కలిసి షాపింగ్ వంటివి చేసి వార్తల్లో నిలిచారు. చాలాకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లాడబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే విడిపోయారని కూడ అన్నారు. అయితే రీసెంట్ గా తన పుట్టినరోజున ఫైమా ప్రవీణ్ అనే వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉన్నానని చెప్పి సర్ప్రైజ్ ఇచ్చింది. ఇప్పుడు ఆమె పెళ్లాడబోయే వ్యక్తి ఇతనేనని అంటున్నారు నెటిజన్లు. అయితే ఫైమా నిజంగానే పెళ్లి చేసుకోబోతోందా? లేదంటే ఆటపట్టించడానికి ఇలాంటి సమాధానం చెప్పిందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇటీవల కాలంలో పలు షోలలో భాగంగా నూకరాజుతో కూడా ఫైమాకు లింకు కలపడానికి ప్రయత్నిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు