Jabardasth Mohan..ఈమధ్య కాలంలో అయితే జబర్దస్త్ లో ఎక్కువగా లేడీ కమెడియన్స్ ప్రేక్షకులను అలరిస్తున్నారు కానీ ఈ షో ప్రారంభమైన కొత్తలో చాలామంది మగవారే అమ్మాయిల గెటప్లలో ప్రేక్షకులను అలరించేవారు.. అయితే 2013లో మొదలైన ఈ షోలో.. అప్పట్లో పాల్గొన్న కొంతమంది ఇప్పటికీ లేడీ గెటప్స్ ల తోనే అలరిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉండడం గమనార్హం .. ఇక ప్రస్తుతం జబర్దస్త్ మాత్రమే కాదు ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ షోలలో కూడా ఈ లేడీ గెటప్లలో ఉన్న చాలా మంది కమెడియన్స్ ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు వెళుతున్నారు..
శ్రీదేవి డ్రామా కంపెనీలో భార్యతో మోహన్..
ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా లేడీ గెటప్లలో అలరిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న వారిలో ప్రధమంగా వినిపించే పేరు మోహన్.. ఇటీవల నెల క్రితం వివాహం చేసుకున్న ఈయన.. తాజాగా ఈ లేడీ గెటప్స్ గురించి.. తాను పడ్డ ఇబ్బందుల గురించి వెల్లడిస్తూనే.. తన భార్యతో కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సందడి చేశారు.. అంతేకాదు నీ స్టేజ్ పైన మోహన్ భార్య దేవి తమ పెళ్లి జరగడం వెనుక ఉన్న కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయింది.. తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా .. ఈ ప్రోమోలో వారు తమ బాధలన్నింటిని బయటపెట్టినట్లు తెలుస్తోంది..
స్టేజ్ పై మోహన్ భార్య ఎమోషనల్..
ఈ షోకి మోహన్ తన భార్యతో కలిసి హాజరయ్యారు. ఇక స్టేజ్ పైనే అతని భార్య మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.. స్టేజ్ మీదకి ఇద్దరు రాగానే.. హోస్టుగా వ్యవహరిస్తున్న రష్మీ మాట్లాడుతూ.. మీ ఇద్దరిదీ ప్రేమ వివాహమా..? లేక పెద్దలు కుదిరిచిన వివాహమా? అని అడిగితే.. రెండూ అని సమాధానం ఇచ్చింది. అదేంటి అంటే.. తాము ప్రేమించుకున్నామని.. అయితే పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నామని మోహన్ భార్య వెల్లడించింది.. అయితే ఆమె మాట్లాడుతూ.. మోహన్ ని నేను వివాహం చేసుకోవడం మా అమ్మ నాన్నలకు ఇష్టం లేదు.. ఎందుకంటే మోహన్ అమ్మాయిలా ఉంటాడు.. ఎక్కువగా జబర్దస్త్ లో అమ్మాయిల పాత్రలే వేస్తాడు.. అందుకే వాళ్ళకి మోహన్ నచ్చలేదు.. కానీ నేను మోహన్ ను ఇష్టపడ్డాను.. కాబట్టి కష్టమైనా సరే అమ్మా నాన్నను ఒప్పించి వివాహం చేసుకున్నాను అంటూ మోహన్ భార్య దేవి వెల్లడించింది.. ఇకపోతే తమ తల్లిదండ్రులను ఒప్పించే సమయంలో తాము ఎన్నో కష్టాలను అనుభవించామని ఎమోషనల్ అయింది. ఇకపోతే ఇదే ప్రోమోలో ఆటో రాంప్రసాద్, పొట్టి నరేష్, ఫైమా లాంటి వాళ్ళు తమదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేశారు.. ఇక మొత్తం మీద జబర్దస్త్ మోహన్ భార్య దేవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే త్వరలోనే ఈ షో ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఏది ఏమైనా పూర్తి ఎపిసోడ్ వస్తే తప్ప వీరు ఏం మాట్లాడారు అనే విషయాలు తెలియవనే చెప్పాలి.