Jabardasth Rohini: డ్రగ్స్ కేసులో రోహిణి.. జర్నలిస్ట్ మాటలకు గట్టి కౌంటర్..!

Jabardasth Rohini.. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషలలోని సెలబ్రిటీలు కూడా సినిమా ప్రమోషన్స్లను కాస్త వెరైటీగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ట్రెండ్ కు తగ్గట్టుగా సినిమా ప్రమోషన్ అయితే చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాని చాలా ఎక్కువగా సినిమా ప్రమోషన్స్ కోసమే ఉపయోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ట్రెండుకు తగ్గ విషయాలతో, ట్రైలర్లతో జనాలలోకి ఎక్కువగా ఏది వెళుతుందో వాటి ద్వారానే ప్రమోషన్స్ ను సైతం చేస్తున్నారు. తాజాగా బర్తడే బాయ్ అనే ఒక సినిమా కోసం జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న జబర్దస్త్ ఫేమ్ రోహిణి రేవు పార్టీలో దొరికినట్లుగా ఒక ఫన్నీ వీడియో చేయడం జరిగింది.

Jabardasth Rohini: Rohini in the drug case.. Strong counter to journalist's words..!
Jabardasth Rohini: Rohini in the drug case.. Strong counter to journalist’s words..!

రేవ్ పార్టీ లో చిక్కిన రోహిణి..

అయితే ఇదివరకే నటి హేమ రేవు పార్టీలో దొరికిన సంగతి తెలిసిందే.. ఈ విషయం అటు ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దాదాపుగా పది రోజులపాటు ఈ న్యూస్ విషయంలో హేమ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నది. తాజాగా రోహిణి తన సినిమా ప్రమోషన్ లో భాగంగా రేవ్ పార్టీలో దొరికినట్టుగా ఒక వీడియో ద్వారా తెలియజేసింది.. దీంతో చాలామంది ఆశ్చర్యపోయారు.. అయితే అది సినిమా ప్రమోషన్స్ లో భాగమని తెలిసి కాస్త అభిమానులు కుదుటపడినప్పటికీ మరి కొంతమంది నవ్వుకున్నారు.

రోహిణి పై జర్నలిస్ట్ షాకింగ్ కామెంట్స్..

తాజాగా ఈ విషయం పైన ఒక జర్నలిస్టు మాత్రం పలు రకాల కామెంట్స్ చేశారు.. ముఖ్యంగా రోహిణి ఇలా చేసింది అంటే నిప్పు లేనిదే పొగరాదు.. ఆమె రేవు పార్టీకి వెళ్లే ఉంటుంది అన్నట్టుగా మాట్లాడినట్లు సమాచారం.. దీంతో ఈ విషయంపై రోహిణి ఒక రేంజ్ లో ఫైర్ అయ్యింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేస్తూ ఆమె మాట్లాడటం జరిగింది..”నేను బర్తడే బాయ్ అనే ఒక సినిమా ప్రమోషన్స్ ని చేశాను.. అది వీడియో ప్రమోషన్స్ కోసమే.. తెలుసుకొని మీడియా ముందు వాటిని చాలా ఫన్నీగా తీశాము అంటూ తెలిపింది”.

- Advertisement -

జర్నలిస్ట్ పై రోహిణి ఫైర్..

అయితే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈ విషయం పైన చాలా తప్పుగా మాట్లాడారు.. ఒక వీడియో లో కూర్చొని ఇలా మాట్లాడడం సరికాదు.. రేవు పార్టీ అనగానే నిజంగా దొరికే ఉంటుంది… నిప్పు లేకుండా పొగ రాదు కదా అన్నారు.. దీనిపై మండి పడ్డ రోహిణి.. ఏదైనా మాట్లాడే ముందు నిజం తెలుసుకొని మాట్లాడాలి. ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా ఎవరు మాట్లాడకూడదంటూ తెలిపింది రోహిణి.. పైగా మీలాంటి వారు సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకొస్తున్నారు.. నేను మందు కూడా తాగను.. సినిమాలో చూపించేవన్నీ కూడా నిజం కాదు.. అలాగే నా పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడారు.. నేను సర్జరీ చేయించుకోవడం వల్లే కాస్త అధిక బరువు పెరిగాను.. “డ్రగ్స్ తీసుకుంటుంది..అందుకే తనకి ఇంకా పెళ్లి కాలేదు.. అందుకే అలా ఉండిపోయింది ” అంటూ చాలా దారుణంగా మాట్లాడారు.. మీరు సీనియర్ కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడాను.. మరెవరైనా అయితే మాత్రం చెప్పు తీసుకొని కొట్టేదాన్ని అంటూ రోహిణి ఒక వీడియో ద్వారా తెలియజేసింది. అందుకు సంబంధించి వీడియో మాత్రం వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Rohini (@actressrohini)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు