Jagapathi Babu : సిగ్గు, శరం లేకుండా… క్యాసినోలో జగ్గుభాయ్ హల్చల్..

Jagapathi Babu : టాలీవుడ్ విలక్షణ నటుడు, హీరో జగ్గూ భాయ్ అలియాస్ జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సినీ కేరీర్ ప్రారంభం నుంచే ఎన్నో హిట్ సినిమాల్లో నటిస్తూ మెప్పించాడు. ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్ గా నిలిచిన జగపతి బాబు ఇప్పుడు కుర్ర హీరోలకు పోటీని ఇస్తూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు.. ఈయన ఒకవైపు సినిమాలతో మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉంటాడు. నిత్యం ఏదొక పోస్ట్ పెడుతూ ట్రెండ్ అవుతుంటారు.. తాజాగా సిగ్గు, శరం అంటూ ఓ సంచలన పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

తాజాగా జగ్గూ భాయ్ ఓ క్యాసినోకి వెళ్లి అక్కడ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ పోస్ట్‌కు.. నాకు సిగ్గు శరం లేదని దిగులు పడను.. కానీ మీరు చెబితే పడతాను అంటూ ఈ పోస్ట్ కింద కొటేషన్ రాసుకోచ్చాడు. ఈ ఫొటో చూస్తుంటే జగ్గూభాయ్ క్యాసినోలో పోకర్ గేమ్ ఆడినట్లు తెలుస్తుంది. ఆ ఫోటో కు అలాంటి క్యాప్షన్ ఎందుకు పెట్టాడా అని ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు.. ఏదేమైనా ఈ ఫోటో మాత్రం నెట్టింట ట్రెండ్ అవుతుంది..

ఈయన బాలయ్య నటించిన సూపర్ హిట్ లెజెండ్ సినిమాతో విలన్ గా పరిచయం అయ్యాడు.. ఆ తర్వాత శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, మహర్షి, అఖండ, సలార్‌ వంటి హిట్ సినిమాల్లో విలన్ గా చేశాడు.. హాలివుడ్ లో కూడా నటించడానికి రెడీ అవుతున్నట్లు ఆ మధ్య సోషల్ మీడియాలో ద్వారా తెలిపాడు.. ఇక గతేడాది సలార్‌తో పాటు ‘రుద్రంగి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జగపతిబాబు ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం జగ్గూభాయ్ సలార్ 2 చిత్రంలో నటిస్తున్నాడు.. పుష్ప2 లో కూడా నటిస్తున్నాడు.

- Advertisement -

అయితే ప్రస్తుతం ఈ విలన్ పోటీగా కొత్త నటుడు వస్తున్నాడు. ఈయనను విలన్ గా పరిచయం చేసిన బోయపాటి శ్రీనునే ఇప్పుడు జగ్గుభాయ్ కి పోటీ తీసుకోస్తున్నాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన అఖండ సినిమాలో విలన్ పాత్రలో శ్రీకాంత్ నటించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత శ్రీకాంత్.. కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ సినిమాలో కూడా ప్రతినాయకుడి పాత్రలో కనిపించి మెప్పించాడు. దీని తర్వాత శ్రీకాంత్‌కు మరోసారి విలన్ పాత్రలు వచ్చే ఛాన్స్ లేకపోలేదు. అదే జరిగితే, ఇప్పుడు క్యాసినో అంటూ ఏంజాయ్ చేస్తున్న జగ్గుభాయ్ కి పోటీ తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు