MrBacchan : పని పూర్తి చేసిన జగ్గూ భాయ్.. స్పీడు పెంచిన హరీష్!

MrBacchan : మాస్ మహారాజ్ రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘మిస్టర్ బచ్చన్’ అంటూ ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ రైడ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై క్రేజీ అంచనాలున్నాయి. రవితేజ హరీష్ శంకర్ ల హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి అభిమానుల్లో కూడా క్రేజీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో రవితేజ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడని భావిస్తున్నారు. ఇక ఆ మధ్య రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, రీసెంట్ గా రిలీజ్ చేసిన ‘సితార్’ సాంగ్ కూడా పాపులర్ కాగా, ఆ సాంగ్ లో కొరియోగ్రఫీ పై మాత్రం విమర్శలు వచ్చాయి. అయినా సినిమాపై మంచి క్రేజీ బజ్ ఏర్పడగా, ఆగష్టు 15న సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమాకి సంబంధించి అన్ని పనుల్లోనూ చిత్ర యూనిట్ వేగం పెంచారు.

Jagapathi Babu finished dubbing for MrBacchan

డబ్బింగ్ ఫినిష్ చేసిన జగ్గూ భాయ్..

ఇక మిస్టర్ బచ్చన్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా ఫ్యాన్స్ ట్రెండ్ చేసేస్తున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. రవితేజకి ధీటైన పవర్ ఫుల్ పాత్రలో జగపతిబాబు నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు జగపతిబాబు కూడా పలు ఇంటర్వ్యూలలో మిస్టర్ బచ్చన్ లో తన రోల్ సరికొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మిస్టర్ బచ్చన్ సినిమాలో జగపతి బాబు తన పాత్రకు సంబంధించి లేటెస్ట్ గా డబ్బింగ్ పనులు ఫినిష్ చేసాడు. ఈ విషయాన్నీ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

- Advertisement -

ప్రమోషన్లలో హరీష్ స్పీడు…

ఇక మిస్టర్ బచ్చన్ (MrBacchan) సినిమాకి సంబంధించి హరీష్ శంకర్ ఫుల్ స్పీడు మీదున్నాడు. ఆగష్టు లో రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా, ఇప్పటికే టీజర్, సాంగ్ రిలీజ్ చేయగా, త్వరలో మరిన్ని ప్రమోషన్లతో సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నంలో ఉన్నారు. ఇక మేకర్స్ రవితేజ పర్ఫార్మెన్స్‌ తో మిస్టర్ బచ్చన్ సినిమా ఊర మాస్ రేంజ్ లో ఉంటుందని, అంటున్నారు. ఇక ఈ సినిమాలో భాగ్య శ్రీ బొర్సె హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వివేక్ కూచిబొట్ల, టీజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు