Jai Hanuman: ఘోరాతి ఘోరంగా పడిపోయిన జై హనుమాన్ హైట్స్.. కారణం ఏంటంటే..?

Jai Hanuman: 2024 లో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించిన మూవీలలో హనుమాన్ మూవీ కూడా ఒకటి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది.

ఇక ఈ మూవీ సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలతో తలపడింది. ఈ మూవీకి పోటీగా వచ్చిన గుంటూరు కారం చిత్తుచిత్తుగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. హనుమాన్ మూవీ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ జై హనుమాన్ అనే పేరుతో సీక్వెల్ ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీక్వెల్ పై ఇప్పటికే భారీ హైప్స్ ఉన్నాయి.

jai-hanuman-heights-where-ghorathi-fell-badly
jai-hanuman-heights-where-ghorathi-fell-badly

తాజాగా ఈ మూవీ పై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత కొన్ని రోజుల నుంచి జై హనుమాన్ ఊసే వినిపించడం లేదు. మేకర్స్ ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో జై హనుమాన్ మూవీ రూపొందుతుంది అనే మాటే మర్చిపోయారు ప్రేక్షకులు. ఒకానొక సమయంలో మంచి హైప్స్ ని నెలకొల్పుకున్న ఈ సినిమా ప్రెసెంట్ ఆ హైప్స్ ని మొత్తం కోల్పోయింది. మరి ఇది గమనించి మేకర్స్ తగిన జాగ్రత్తలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు