Rajamouli – Mahesh movie: జక్కన్న – మహేష్ మూవీలో ఆదిపురుష్ నటుడు.‌..!

Rajamouli – Mahesh movie: దర్శక దీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాహుబలి, త్రిబుల్ ఆర్ వంటి గొప్ప గొప్ప సినిమాలను రూపొందించి ఎనలేని పాపులారిటీని సంపాదించుకున్నాడు ఈ డైరెక్టర్. ఇక ప్రజెంట్ టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబుతో ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్స్ ఏర్పడ్డాయి. ఇటు మహేష్ అభిమానులతో పాటు అటు జక్కన్న అభిమానులలో కూడా ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజమౌళి ఈ సినిమాలో గొప్ప గొప్ప నటీనటులను ఎంచుకుంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమాలో ఆది పురుష్ నటుడు దేవ దత్తనాగే జాయిన్ అయినట్లు తెలుస్తుంది.

jakkanna-adipurush-actor-in-mahesh-movie
jakkanna-adipurush-actor-in-mahesh-movie

ఇంత భారీ ప్రాజెక్టులో ఈ నటుడు అవకాశం అందుకోవడంతో ఈ నటుడి పై చర్చలు మొదలయ్యాయి. ఎవరు ఊహించని విధంగా ఈ నటుడిని తీసుకోవడంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. దేవ దత్తనాగే రాజమౌళితో ఉన్న ఫోటో ఒకటి ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు