Jalsa: మళ్ళీ రాబోతుంది

జానీ సినిమా తర్వాత పదేళ్లు హిట్ లేదు
అయినా ఇమేజ్ చెక్కు చెదరలేదు.
రెండేళ్లకు ఒక సినిమా, అయినా ఓపెనింగ్స్ కు డోకా లేదు,
ఆయన సినిమా వస్తే చాలు దానికి హిట్టు ప్లాప్ తో సంబంధం లేదు.
అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే.

వరుస ఫెయిల్యూర్ సినిమాలు తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా మంచి హిట్ అయింది.
అప్పటివరకు జానీ సినిమా తరువాత సరైనా హిట్ లేని పవన్ కెరియర్ కు,ఇటు త్రివిక్రమ్ కెరియర్ కు మంచి ప్లస్ అయింది.
అప్పటినుండే వాళ్లద్దరి మధ్య స్నేహం చిగురించి ఆప్త మిత్రులుగా మారింది.త్రివిక్రమ్ ఆ సినిమాని డీల్ చేసిన విధానం,
సంజయ్ సాహు కేరెక్టరైజేషన్ ఎప్పటికి మరచిపోలేము.

ఖుషి సినిమా తరువాత పవన్ కళ్యాణ్ ను అంత అందంగా చూపించాడు త్రివిక్రమ్.జల్సా సినిమా ఇంటర్వెల్ ముందు వచ్చే డైలాగ్స్ ఇప్పటికే కాదు ఎప్పటికి మరచిపోలేము.పవన్ కెరియర్ బెస్ట్ డైలాగ్స్ అవి.సినిమాలో అన్ని ప్లస్ పాయింట్స్ తో పాటు, జల్సా సినిమాకి త్రివిక్రమ్ ఎంచుకున్న ప్లాట్ అండ్ ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే డైలాగ్స్ ఈ సినిమాని ఇంకో రేంజ్ కి తీసుకెళ్లాయి.పవర్ స్టార్ కి సూపర్ స్టార్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ఇప్పటికి ఒక ఫ్రెష్ ఫీల్ ను ఇస్తుంది.

- Advertisement -

ఇదే సినిమా ఇప్పుడు మళ్ళీ రిలీజైతే.? ఆ ఫీల్ ఒక హై ఇస్తుంది కదా.
అదే జరగబోతుంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే సంధర్బంగా జల్సా సినిమా 4కే వెర్షన్ చేసి మళ్ళీ షోస్ వేయనున్నట్లు విశ్వనీయవర్గాల సమాచారం. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ సంస్థ ఈ పనుల్లో బిజీగా ఉందట.

రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డే సంధర్బంగా పోకిరి సినిమాను ప్రదర్శించనున్నారు. ఇదివరకే ఓపెన్ చేసిన టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి. దీనితో మహేష్ అభిమానులు ఫుల్ జోష్ మీద ఉన్నారు.

అలానే జల్సా సినిమాను సెప్టెంబర్ 2 ప్రదర్శిస్తే భారీ స్పందన వస్తుంది.
పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మళ్ళీ వింటేజ్ కళ్యాణ్ ను మరోసారి వెండితెరపై చూస్తే అభిమానులుకు గూస్ బమ్స్ గ్యారంటీ అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు