Janaka Aitey Ganaka: సుహాస్ కి పాన్ ఇండియా స్టార్ సపోర్ట్

Janaka Aitey Ganaka: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది గొప్ప నటులు ఉన్నారు. ఏ పాత్ర ఇచ్చినా కూడా దానిలో ఒదిగి పోవడం అనేది ఆ యొక్క నటుల శైలి. ప్రస్తుతం ఉన్న హీరోల్లో మంచి పేరు సాధించుకొని తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్నాడు సుహాస్. ఛాయ్ బిస్కెట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ లో కొన్ని వీడియోలు చేసుకుంటూ అక్కడ తన కెరియర్ ను మొదలుపెట్టాడు సుహాస్. యూట్యూబ్లో ఉన్నప్పుడే చాలామంది సెలబ్రిటీస్ దృష్టిలో పడ్డాడు.

సుహాస్ నటించిన మొదటి సినిమా కలర్ ఫోటో. ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుహాస్. ఈ సినిమాలో సుహాస్ పర్ఫామెన్స్ చూసి చాలామంది ఫిదా అయిపోయారు.ఈ సినిమా కరోనా టైంలో రావడం వలన థియేటర్లో రిలీజ్ కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ లో మాత్రమే రిలీజ్ అయింది. ఈ సినిమా ఓటిటిలో మంచి ఆదరణను సాధించింది. ఈ సినిమా ఒక నటుడుగా కూడా సుహాస్ కి మంచి సంతృప్తి ఇచ్చిందని చెప్పొచ్చు.

ఈ సినిమా తర్వాత సుహాస్ చేసిన సినిమా “రైటర్ పద్మభూషణ్”. రైటర్ పద్మభూషణ్ సినిమా సుహాస్ కి మంచి గుర్తింపుతో పాటు మంచి పేరును, మంచి అవకాశాలను తీసుకొచ్చి పెట్టింది. అసలు సుహాస్ ఎంచుకోవడమే మంచి మంచి కథలను ఎంచుకుంటున్నాడని చెప్పొచ్చు. ఫిలిం ఇండస్ట్రీలో ఒకసారి గుర్తింపు వచ్చింది అంటే ఒకేసారి అవకాశాలన్నీ ముందుకు వచ్చేస్తాయి. అవకాశాలన్నిటిలో ఏది మనం పిక్ చేసుకుంటే కెరీర్ లో ముందుకు వెళ్తాం అని ఆలోచించడం ఒక ఎత్తు. అలా ఆలోచించి అడుగులు వేస్తే ఎప్పటికీ కెరియర్ ఉంటుందని చాలామందికి తెలియక తప్పులు చేస్తుంటారు. ఆ విషయంలో మాత్రం సుహాస్ కి మాత్రం మంచి క్లారిటీ ఉందని చెప్పొచ్చు.

- Advertisement -

Janaka Aithe Ganaka

ఇక ప్రస్తుతం సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం సుహాస్ కెరియర్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక సుహాస్ చేస్తున్న లేటెస్ట్ ఫిలిం “జనక అయితే గనక”. సందీప్ రెడ్డి బండ్ల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. రీసెంట్గా రిలీజ్ అని ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ ను ఇంస్టాగ్రామ్ వేదిక ప్రభాస్ షేర్ చేశారు. అయితే కొందరు సుహాస్ కి పాన్ ఇండియా స్టార్ హీరో సపోర్ట్ కూడా ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు